గబ్బా టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ 81 పరుగులతో రాణించిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 77 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

తొలి టెస్టు ఆడుతున్న సుందర్, తన కెరీర్‌లో తొలి వికెట్‌‌గా స్మిత్‌ను అవుట్ చేశాడు. సుందర్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే వికెట్ దక్కడం విశేషం. 87 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్. 
లబుషేన్ 103 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. స్మిత్, లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 

21 ఏళ్ల 102 రోజుల వయసులో ఆసీస్ గడ్డపై వికెట్ సాధించాడు సుందర్. సచిన్, ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ, శివరామకృష్ణన్, చేతన్ శర్మ... సుందర్ కంటే ముందున్నారు.