Asianet News TeluguAsianet News Telugu

SL vs ZIM: వనిందు హసరంగా విశ్వ‌రూపం.. 7 వికెట్లతో జింబాబ్వే ను దెబ్బ‌కొట్టి.. !

SL vs ZIM: జింబాబ్వే-శ్రీలంక మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డేలో శ్రీలంక టీమ్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. శ్రీలంక బౌల‌ర్ వనిందు హసరంగా 7 వికెట్లు తీసుకుని జింబాబ్వే ను దెబ్బ‌కొట్టాడు. వ‌న్డే క్రికెట్ లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. 
 

Sri Lanka vs Zimbabwe: Wanindu Hasaranga hits Zimbabwe, He took seven wickets and set a new record RMA
Author
First Published Jan 12, 2024, 3:02 PM IST

SL vs ZIM - Wanindu Hasaranga: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వ‌న్డేల సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్ లో వనిందు హసరంగా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. శ్రీలంక స్పిన్ సంచలనం వనిందు హసరంగ 7/19తో జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. త‌న ఈ ఇన్నింగ్స్ తో హ‌స‌రంగ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. వ‌న్డేల‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేసిన టాప్-5 బౌల‌ర్ల లిస్టులో చోటు సంపాదించాడు.

ఐసీసీ వ‌న్డేల‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు-టాప్-5 బౌల‌ర్లు 

చమిందా వాస్ (SL)    8/19    v జింబాబ్వే, 2001
షాహిద్ అఫ్రిది (PAK)    7/12    v వెస్టిండీస్, 2013
గ్లెన్ మెక్‌గ్రాత్ (AUS)    7/15    v నమీబియా, 2003
రషీద్ ఖాన్ (AFG)    7/18    v వెస్టిండీస్, 2017
వానిందు హసరంగా (SL)    7/19    v జింబాబ్వే, 2024

23 సంవత్సరాల క్రితం ఇదే జింబాబ్వే పై చమిందా వాస్ 8/19తో శ్రీలంక బౌలర్ చేసిన గణాంకాలు పురుషుల వ‌న్డే చ‌రిత్ర‌లో అత్యుత్తమ గ‌ణాంకాలు. 

టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

వ‌న్డే సిరీస్ కైవ‌సం చేసుకున్న శ్రీలంక‌

కొలంబోలో వర్షం అంతరాయం కలిగించడంతో 50 ఓవర్ల మ్యాచ్ ను 27 ఓవర్లకు కుదించారు. బౌలింగ్ లో ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక జింబాబ్వేను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. శ్రీలంక విధ్వంసకర బౌలింగ్ దాడితో ఆతిథ్య జట్టు ఉక్కిరిబిక్కిరి అయింది. వ‌రుస వికెట్లు కోల్పోయిన జింబాబ్వే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆరు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన వనిందు హసరంగ తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. జింబాబ్వే తరఫున 7 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు.  దీంతో జింబాబ్వే 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. హసరంగ తొలి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మ‌న్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావ‌డం క‌ర‌క్టేనా...?

జింబాబ్వే 22.5 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. హసరంగ 19 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి జింబాబ్వే స్వల్ప స్కోరుకే కుప్పకూలడంలో కీలకంగా ఉన్నాడు. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ అజేయంగా 66 పరుగులు చేసి జట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండు, మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి సిరీస్ ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది.

భార‌త నెంబ‌ర్.1 క్రికెట‌ర్ టెండూల్క‌ర్ కాదు, కోహ్లీ కాదు.. మ‌రి ఇంకెవ్వ‌రు?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios