ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మన్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావడం కరక్టేనా...?
India vs Afghanistan: మొహాలీ వేదికగా జరిగిన తొలివన్డేలో ఆఫ్ఘనిస్థాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. రనౌట్ అయిన తర్వాత రోహిత్ శర్మ.. గ్రౌండ్ లోనే శుభ్‌మన్ గిల్ పై ఫైర్ అయ్యాడు.. అసలు తప్పు ఎవరిది..?
Rohit Sharma - Shubman Gill : మొహాలీ వేదికగా జరిగిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. శివమ్ దూబే, జితేశ్ శర్మ, తిలక్ వర్మలు రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ చిత్తు చేసింది. అయితే, టీ20 రీఎంట్రీ మ్యాచ్ లో అదరగొడుతాడనున్న రోహిత్ శర్మ.. డకౌట్ అయ్యాడు. తాను ఔట్ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే, మైదానాన్ని వీడుతూ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మాన్ గిల్‌పై ఫైర్ అయ్యాడు. గ్రౌండ్ లోనే శుభ్‌మన్ గిల్ పై రోహిత్ శర్మ నోరుపారేసుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ రనౌట్ లో అసలు తప్పు ఎవరిది? శుభ్‌మన్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ అవ్వడం కరెక్టేనా..? శుభ్‌మన్ గిల్ ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నాడా?
దాదాపు 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. మైదానాన్ని వీడుతూ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మాన్ గిల్‌పై ఫైర్ అయ్యాడు. అయితే, ఇద్దరిమధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. పరుగు రావాల్సిన దగ్గర క్రీజు నుంచి శుభ్ మన్ గిల్ కదలకపోవడం.. తొలి ఓవర్ రెండో బంతికే రిస్కీ పరుగుకు రోహిత్ శర్మ ప్రయత్నించడం.. చివరకు ఇద్దరు ప్లేయర్ల మధ్య గందరగోళం మధ్య హిట్ మ్యాన్ రనౌట్ గా వెనుతిరిగాడు. మ్యాచ్ తొలి ఓవర్ రెండో బంతికి ఫజల్‌హాక్ ఫరూఖీ బౌలింగ్ లో రోహిత్ గ్రౌండ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ సారథి ఇబ్రహీం జద్రాన్ మిడ్-ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. రోహిత్ షాట్‌ను అద్భుతంగా ఆపడానికి అతను తన కుడివైపుకి దూసుకెళ్లాడు. అప్పటికే ట్రాక్‌లో ఉన్న రోహిత్ పరుగు చేయడానికి కాల్ ఇచ్చాడు.
మరోవైపు రోహిత్ పరుగుకు రాగా, శుభ్ మన్ గిల్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బంతిని చూస్తూ క్రీజు నుంచి కదల్లేదు. రోహిత్ కాల్ నుంచి గిల్ గ్రహించే సమయానికి, రోహిత్ అప్పటికే నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నాడు. జద్రాన్ బంతిని స్ట్రైకర్ ఎండ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ వేసి రోహిత్ ను రనౌట్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరి మధ్య జూనియర్ భాగస్వామి అయిన గిల్, రోహిత్ కోసం తన వికెట్‌ను త్యాగం చేయడానికి తన క్రీజ్‌ను వదలలేదు.. దీంతో రోహిత్ శర్మ వైదానం వీడుతూ.. గిల్ పై కోపంగా అరుస్తూ ఫైర్ అయ్యాడు. ఇక్కడ శుభ్ మన్ గిల్ బంతిని చూసే బదులు రోహిత్ కాల్ కు ప్రతిస్పందించాల్సి ఉండివుంటే వికెట్ పడేది కాదు. అయితే, సీనియర్ ప్లేయర్ అయివుండి రోహిత్ శర్మ ఇలాంటి పరుగుకు ప్రయత్నించి ఉండాల్సింది కాదు. అది కూడా తొలి ఓవర్ లోనే రెండో బంతికే రిస్కీ పరుగు కాల్ ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దాదాపు ఏడాది తర్వాత మొహాలీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ రనౌట్ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇక్కడ రనౌట్ అయిన తర్వాత రోహిత్ శర్మ శుభ్‌మాన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం పై సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ వస్తున్నాయి. రోహిత్ దురదృష్టమనీ, గిల్ త్వరగా స్పందించాల్సిందని హిట్ మ్యాన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నాడు. ఇదే సమయంలో కొంత మంది నెటిజన్లు మాత్రం గిల్ పై రోహిత్ శర్మ అలా ఫైర్ అయివుండకూడదని పేర్కొంటున్నారు. ఒక సీనియర్ ప్లేయర్ గా అక్కడి పరిస్థితిని చూసి స్పందించాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక రోహిత్ శర్మ తన రనౌట్ పై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందిస్తూ.. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయనీ, ఇలా జరిగినప్పుడు ఎవరైనా నిరాశ చెందుతారు.. ఎందుకంటే మీరు అక్కడ ఉండి జట్టుకోసం పరుగులు చేయాలనుకుంటారు..కానీ మనం అనుకున్న విధంగా ఎప్పుడూ అన్ని జరగవవని పేర్కొన్నాడు.
India vs Afghanistan: తన డకౌట్ పై రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే.. !
- Cricket
- Gill
- India Afghanistan T20 Match
- India Afghanistan T20 Series
- India vs Afghanistan T20I
- India vs Afghanistan
- India vs Afghanistan T20Series. India vs Afghanistan T20 Match
- Mohali
- Rohit
- Rohit Sharma
- Rohit Sharma duckout
- Rohit Sharma fire at Shubman Gill
- Rohit Sharma run out
- Shubman Gill
- Shubman Gill Rohit Sharma fight
- Sports
- Virat Kohli
- Who's Wrong