Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ ద్రావిడ్ నమ్మకం గెలిపించిన దీపక్ చాహర్..!

ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టిన దీపక్ చాహర్... ఈసారి బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.  మ్యాచ్ ఓడిపోయినట్లే అని అందరూ అనుకున్న సమయంలో చాహర్ అదరగొట్టాడు.

Sri Lanka vs India 2nd ODI: Rahul Dravid's Belief In My Batting Pushed Me To Perform, Says Deepak Chahar
Author
hyderabad, First Published Jul 21, 2021, 10:12 AM IST

శ్రీలంకపై రెండో వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ విజృంభించాడు. అప్పటి వరకు ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టిన దీపక్ చాహర్... ఈసారి బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.  మ్యాచ్ ఓడిపోయినట్లే అని అందరూ అనుకున్న సమయంలో చాహర్ అదరగొట్టాడు.

బ్యాటింగ్‌లోనూ ఏడో స్థానంలో వెళ్లి 82 బంతుల్లో 7x4, 1x6 సాయంతో 69 పరుగులు చేసి భారత్ జట్టుని గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా చాహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది.

కాగా.. తన విజయానికి తమ కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమంటూ దీపక్ చాహర్ పేర్కొన్నాడు. ‘రాహుల్ ద్రవిడ్ సార్ అన్ని బంతుల్నీ ఆడాలని నాకు సూచించాడు. భారత్-ఎ జట్టు తరఫున నేను కొన్ని మ్యాచ్‌లు ఆడాను. ఆ నమ్మకంతో .. నెం.7లో నువ్వు చక్కగా బ్యాటింగ్ చేయగలవు అని చెప్పారు. సార్‌ నాపై నమ్మకం ఉంచారు. బహుశా రాబోవు మ్యాచ్‌ల్లో నాకు బ్యాటింగ్ అవకాశం పెద్దగా రాకపోవచ్చు’ అని మ్యాచ్ తర్వాత దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. రాహుల్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా..జట్టుకు విజయాన్ని అందించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios