Asianet News TeluguAsianet News Telugu

SRH vs RCB IPL 2020: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్... చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్

హాఫ్ సెంచరీతో రాణించిన బెయిర్ స్టో...

బ్యాడ్‌లక్‌తో వార్నర్ రనౌట్... కుప్పకూలిన మిడిల్ ఆర్డర్...

మార్ష్, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్ డకౌట్...

SRH vs RCB IPL 2020:  SunRisers Hyderabad losses their first match in this Season CRA
Author
India, First Published Sep 21, 2020, 11:30 PM IST

IPL 2020: సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 15.1 ఓవర్లలో 121/2 పరుగులతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సులువుగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

డేవిడ్ వార్నర్ బ్యాడ్ లక్ కారణంగా 6 పరుగులకే అవుట్ కాగా మనీశ్ పాండే 34 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బెయిర్ స్టో అవుటైన తర్వాత ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.  విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, మార్ష్ డకౌట్ కాగా, ప్రియమ్ గార్గ్ 12, అభిషేక్ వర్మ 7, రషీద్ ఖాన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

చాహాల్ 3 వికెట్లు తీయగా నవ్‌దీప్ శైనీ 2, శివమ్ దూబే 2 వికెట్లు తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios