Asianet News TeluguAsianet News Telugu

SRHvsKXIP: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం... పంజాబ్ ఆశలు సంక్లిష్టం...

17 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్...

మూడు వికెట్లు తీసిన రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌కు 2 వికెట్లు...

69 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఆరు మ్యాచుల్లో ఐదు పరాజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

SRH vs KXIP: SunRisers Hyderabad comfortable win against Kings XI Punjab CRA
Author
India, First Published Oct 8, 2020, 11:23 PM IST

IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

నికోలస్ పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే రనౌట్ కాగా, సిమ్రాన్ సింగ్ 11, కెఎల్ రాహుల్ 11, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, మన్‌దీప్ సింగ్ 6, ముజీబ్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా... నికోలస్ పూరన్ ఒక్కడూ ఒంటరి పోరాటం చేశాడు.

37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసిన పూరన్... అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 28 పరుగులు రాబట్టాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్ అవుట్ కావడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి ఖరారైంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఖలీల్ అహ్మద్,నటరాజన్ రెండు, అభిషేక్ శర్మ ఓ వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios