IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది... రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్ కలిసి మొదటి వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. త్రిపాఠి 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 పరుగులు చేసి అవుట్ కాగా, శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. 

నితీశ్ రాణా 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేయగా ఆండ్రే రస్సెల్ 9 పరుగులు చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరచాడు. అయితే కేకేఆర్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేయగా, ప్రస్తుత కెప్టెన్ ఇయాన్ మోర్గన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 30 బంతుల్లో 58 పరుగులు జోడించారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, థంపి తలా ఓ వికెట్ తీశారు.