Asianet News TeluguAsianet News Telugu

పోరాడి ఓడిన సన్‌రైజర్స్... ఫైనల్ కల నేెరవేర్చుకున్న ఢిల్లీ... ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై వర్సెస్ ఢిల్లీ...

అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కేన్ విలియంసన్... అబ్దుల్ సమద్ మెరుపులు..

మూడు వికెట్లు తీసిన మార్కస్ స్టోయినిస్... ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన రబాడా...

13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ఢిల్లీ...

నవంబర్ 10న మంగళవారం ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఫైట్ ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్...

SRH vs DC Qualifier 2: Delhi Capitals reached first ever ipl finals after beating sunrisers CRA
Author
India, First Published Nov 8, 2020, 11:18 PM IST

IPL 2020 సీజన్‌లో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ నమోదుచేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా ఫైనల్ చేరని ఒకేఒక్క జట్టుగా ఉన్న ఢిల్లీ, తన తొలి ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది.

190 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వార్నర్ వికెట్ త్వరగా కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 2 పరుగులకే అవుట్ కాగా ఓపెనర్‌గా వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మనీశ్ పాండే 14 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయగా జాసన్ హోల్డర్ 11 పరుగులు చేశాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కేన్ విలియంసన్.. 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 11 పరుగులు చేశాడు. విజయానికి 10 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన దశలో రబాడా ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైంది. ఐపీఎల్ 2020 సీజన్‌ను మూడో స్థానంతో ముగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబాడా 4 వికెట్లు తీయగా స్టోయినిస్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌కి ఓ వికెట్ దక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసిన సన్‌రైజర్స్, 17 పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీకి ఇది మొదటి విజయం కాగా ప్లేఆఫ్‌లో ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఓడడం ఇది రెండోసారి.

Follow Us:
Download App:
  • android
  • ios