IPL 2025 SRH vs DC: ఐపీఎల్ 2025 ప్రారంభంలో వరుస విజయాలతో ముందుకు సాగిన టీం ఢిల్లీ క్యాపిటల్స్. కానీ అక్షర్ పటేల్ అండ్ టీం ఆ కంటిన్యూటీ ని కంటిన్యూ చేయలేకపోయింది. ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ టీమ్ అబ్బ అంది. 

IPL 2025 Sunrisers Hyderabad vs Delhi Capitals:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముందుకు సాగుతున్న కొద్దీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఐపీఎల్ ప్రారంభంలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకొచ్చిన అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ టీమ్ ఇప్పుడు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నది. ఐపీఎల్ 2025 55వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఉప్పల్ స్టేడియం అంటేనే పరుగుల వర్షం కురుస్తుంది. ఢిల్లీ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వస్తుందని అందరూ భావించారు. కానీ, పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఢిల్లీకి బిగ్ షాక్ తగిలింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ డీసీ ని దెబ్బకొట్టాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీ టాపార్డర్ ను పెవిలియన్ కు పంపాడు. బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో 3/19తో ఇన్నింగ్స్ ముగించాడు. 

ఈ మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు వచ్చి ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసులో ఉండొచ్చు అనుకుంటున్న సమయంలో ఢిల్లీ బ్యాటింగ్ లో పూర్తిగా కుప్పకూలిపోయింది. సోమవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ 7 వికెట్లకి 133 పరుగులు మాత్రమే చేసింది. ఒకానొక సమయంలో 100 కూడా దాటలేమేమో అనిపించింది. 29 పరుగులకే 5 వికెట్లు పడిపోయాయి. త్రిస్టాన్ స్టబ్స్ (41 పరుగులు*), ఆశుతోష్ శర్మ (41 పరుగులు) బాగా ఆడటం వల్ల కొంచెం మెరుగైన స్కోరు వచ్చింది. కానీ ఈ స్కోరుతో గెలవడం చాలా కష్టం. ఎందుకంటే సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్.

ఢిల్లీ బ్యాటర్లలో నాయర్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. ఫాఫ్ డుప్లేసిస్ 3 పరుగులు, అభిషేక్ పొరేల్ 8 పరుగులు, కేఎల్ రాహుల్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 6 పరుగులు, విప్రజ్ నిగమ్ 18 పరుగులు చేశారు. 

Scroll to load tweet…

డీసీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం వర్షం పడుతుందని అందరూ భయపడినట్టే జరిగింది. మొదటి ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే భారీ వర్షం కురవడంతో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. భారీ వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇప్పటికే గ్రౌండ్ లో వర్షం నీరు చాలా వచ్చింది. 

Scroll to load tweet…