Asianet News TeluguAsianet News Telugu

కూతురును ఎత్తుకుని.. గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న సన్ రైజర్స్ ఆల్ రౌండర్

Sean Abbott: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ సీన్ అబాట్ ఇంటివాడయ్యాడు.   బుధవారం అతడు తన గర్ల్ ఫ్రెండ్ ను వివాహమాడాడు.

SRH All Rounder Sean Abbott Ties Knot With His Long Time Girlfriend, Shares Pictures
Author
India, First Published Jun 30, 2022, 4:26 PM IST

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ప్రత్యేకం. అందుకు క్రీడాకారులు కూడా అతీతమేమీ కాదు. సెలబ్రిటీల పెళ్లిల్లంటే ఇంకాస్త హంగామా ఎక్కువుంటుంది.  బుధవారం  సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా ఆటగాడు సీన్ అబాట్  ఇంట్లో ఇదే హంగామా నెలకొంది. జూన్ 29న అతడు చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రియర్ అబాట్ ను వివాహమాడాడు. స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అబాట్.. బ్రియర్ ఒక్కటయ్యారు. ఈ జంటకు పెళ్లికి ముందే ఓ పాప కూడా ఉంది. 

న్యూసౌత్ వేల్స్ కు చెందిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తన ఇన్స్టా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ అబాట్ ను పెళ్లి చేసుకున్నాను.  కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో మా  ప్రత్యేకమైన రోజు ఆహ్లాదంగా గడిచింది’ అని రాసుకొచ్చాడు. 

ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘మన రైజర్స్ కు చెందిన అబాట్ జీవితంలో ప్రత్యేకమైన రోజు. కంగ్రాజ్యులేషన్స్ సీన్’ అని ట్వీట్ చేసింది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sean Abbott (@sean_abbott)

ఇక మరో పోస్టులో సీన్ అబాట్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా తన అభిమానులతో పంచుకున్నాడు.  నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ.. కొత్త జంటకు  శుభాకాంక్షలు చెప్పాడు. 

 

2014లో ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన అబాట్  ఇప్పటివరకు జాతీయ జట్టుకు 3 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అయితే  మధ్యలో ఫామ్ కోల్పోయిన అబాట్.. దాదాపు ఐదేండ్ల తర్వాత మళ్లీ 2019 లో తిరిగి పునరాగమనం చేశాడు. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్-ఆస్ట్రేలియా టీ20లో ఆడాడు.  అయితే లంకతో సిరీస్ లో మాత్రం అతడు ఎంపిక కాలేదు. చేతివేలుకు గాయం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని జట్టు నుంచి విశ్రాంతినిచ్చింది. 

ఇక ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్.. సీన్ అబాట్ ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతడిని ఒక్క మ్యాచ్ లోనే ఆడించారు. ఆ మ్యాచ్ (ఢిల్లీతో) లో 4 ఓవర్లు వేసిన అబాట్.. 47 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios