Asianet News TeluguAsianet News Telugu

వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పిన ట్రావిస్ హెడ్.. ఆస్ట్రేలియా క్రికెట్ లో నయా సంచలనం

Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ లో నయా బ్రాడ్మన్ గా గుర్తింపు పొందిన ట్రావిస్ హెడ్ మరో మైలురాయిని అధిగమించాడు. వన్డేలలో  రెండు డబుల్ సెంచరీలు  చేసిన తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. 

South Australia cricketer Travis Head hits two list A double centuries
Author
Hyderabad, First Published Oct 13, 2021, 1:08 PM IST

భారత్ లాగే ఆస్ట్రేలియా లో కూడా క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడుతారు. వాళ్ల జాతీయ క్రీడ కూడా క్రికెట్. దీంతో ఆ జట్టు చాలా కాలం పాటు ప్రపంచ క్రికెట్ ను శాసించింది. బిగ్ బాష్ లీగ్ ద్వారా ఎందరో క్వాలిటీ ప్లేయర్లు జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ తరఫున ఆడుతున్న ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్టియన్ వంటి వాళ్లు ఎంతో మంది అక్కడ్నుంచి వచ్చినవారే. తాజాగా ఆ జాబితాలో మరో క్రికెటర్ దూసుకొస్తున్నాడు. అతడి పేరు ట్రావిస్ హెడ్. 

సౌత్ ఆస్ట్రేలియా తరఫున  ఆడుతున్నTravis Head.. తాజాగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డేలలో రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అదేంటి..? భారత ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కదా  వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నెలకొల్పింది అనుకుంటున్నారు కదా... ఆగండాగండి. మీ అనుమానం నిజమే. ట్రావిస్ హెడ్ ఆడుతున్నది ఆస్ట్రేలియా లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచులు. 

ఇది కూడా చదవండి: మరో వ్యక్తితో టాయిలెట్ లో సెక్స్ చేస్తూ దొరికిపోయిన డేవిడ్ వార్నర్ భార్య.. కాండీస్ చేసిన పనికి షాక్ లో వార్నర్

ది మార్ష్ కప్ లో భాగంగా అడిలైడ్ వేదికగా south australia వర్సెస్ Queensland మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ట్రావిస్ ఈ ఘనత  సాధించాడు.  వర్షం కారణంగా మ్యాచ్ ను 48 ఓవర్లకే కుదించారు.  మూడో నెంబర్ బ్యాట్స్మెన్ గా క్రీజులోకి వచ్చిన హెడ్.. ఆది నుంచే ప్రత్యర్థులపై విరుచుకపడ్డాడు. 127 బంతులెదుర్కొన్న ట్రావిస్.. 28 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230 పరుగులు చేశాడు. ఓపెనర్ జేక్ వెదర్లాండ్ (97), నాథన్ మెక్  స్వీనీ (37) సాయంతో ట్రావిస్ స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

 

65 బంతుల్లోనే సెంచరీ చేసిన హెడ్.. మిగిలిన 62 బంతుల్లో విశ్వరూపం ప్రదర్శించాడు. హెడ్ వీరవిహారంతో సౌత్ ఆస్ట్రేలియా 48 ఓవర్లలోనే 391 పరుగులు చేసింది. 

 

 

కాగా, ఆస్ట్రేలియా లిస్ట్ ఏ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా హెడ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2015లో ఈ లెఫ్ట్ హ్యాండర్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మీద 202 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో మరో క్రికెటర్ ఇంగ్లండ్ కు చెందిన అలీ బ్రౌన్ (సర్రే) కూడా రెండు డబుల్ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ఈ రికార్డు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios