Asianet News TeluguAsianet News Telugu

మరో వ్యక్తితో టాయిలెట్ లో సెక్స్ చేస్తూ పట్టుబడిన భార్య.. కాండీస్ పనికి వార్నర్ షాక్

David Warners Wife: తన ఆటతో పాటు డాన్సులు, టిక్ టాక్ వీడియోలతో హైదరాబాదీలతో పాటు భారతీయులందరకీ సుపరిచితమైన సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలిసిందే. వార్నర్ ఒక్కడే కాదు.. అతడి భార్య కూడా సోషల్  మీడియా స్టారే. కానీ జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేని తప్పు చేశానని టాప్ సీక్రెట్ ను ఆమె  రివీల్ చేసింది. 

sun risers hyderabad player david warners wife candice warner revelas about 2007 toilet tryst
Author
Hyderabad, First Published Oct 13, 2021, 12:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

IPLలో Sun Risers Hyderabad తరఫున ఆడిన డేవిడ్ వార్నర్.. అనూహ్యంగా ఆ జట్టు నుంచి తప్పుకుంటున్నాడు.  వచ్చే సీజన్ లో అతడు ఆడుతాడా..? లేదా..? అన్నది అనుమానంగా ఉంది. అయితే క్రికెట్ ద్వారానే గాక టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్  ద్వారా  కూడా వార్నర్ హైదరాబాదీలతో పాటు భారతీయులకు సుపరిచితమే. David Warnerతో పాటు ఆయన భార్య కాండిస్ వార్నర్ కూడా సోషల్ మీడియా ఫ్యాన్స్ కు తెలుసు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేసిన ఫన్నీ వీడియోలు అభిమానులను ఉర్రూతలూగించాయి. హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే వార్నర్ ను అన్నా అని..Candice Warner ను వదినా అని కూడా పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు కాండిస్ కు చెందిన ఓ టాప్ సీక్రెట్ ను ఆమె ఇటీవలే రివీల్ చేసింది. 

ఈ పచ్చి నిజాన్ని వార్నర్ భార్య candice warner బయటపెట్టింది. గతంలో  తాను ఒక వ్యక్తితో టాయిలెట్ లో శృంగారం చేస్తుండగా దొరికిపోయానని తెలిపింది. ఈ విషయం వార్నర్ తో పాటు చాలా మందికి తెలుసునని బాంబు పేల్చింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాండిస్.. తన గతానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. అది 2007 వ సంవత్సరం. Australiaలో క్రాస్ కోడ్ అనే గేమ్ ఉంది. ఇది ఒక రియాల్టీ గేమ్ షో వంటిది. మన BigBoss లాంటిది. ఇందులో పాల్గొనే వ్యక్తులు ఏదైనా ఒక వేషం వేసుకుని ఆటలాడుతుంటారు. ఆ సమయంలో కాండిస్ వార్నర్  Cross code Gameలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆసీస్ లో ఇదే ఆట ఆడటంలో సన్నీ బిల్ విలియమ్స్ అనే వ్యక్తి కూడా సూపర్ స్టార్. ఇంకేం వీరిద్దరికి స్నేహం కుదిరింది. 

ఇది కూడా చదవండి: MS Dhoni: ఆ పనికి ధోని ఒక్క పైసా తీసుకోలేదు: బీసీసీఐ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇద్దరూ కలిసి ఓరోజు రాత్రి పూట ఫుల్లుగా మందు తాగారు. ఆ తర్వాత టాయిలెట్లో దూరి తాగిన మైకంలో SEXలో పాల్గొన్నారు. దీనిని వీడియో తీసిన ఎవరో లీకువీరులు.. ఆ  క్లిప్ ను ఆన్లైన్ లో పెట్టి రచ్చ రచ్చ చేశారు. దీంతో కాండిస్, బిల్  విలియమ్స్ ల Sex Scandle మార్మోగిపోయింది. 

 

ఈ ఉదంతం తర్వాత కాండిస్ తన తప్పు తెలుసుకుంది. తన జీవితాన్ని బజారుకీడ్చిన క్రాస్ కోడ్ గేమ్ కు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కొంత కాలానికి డేవిడ్ వార్నర్ ను పెళ్లి చేసుకుంది. కాండిస్ మనసు తెలుసుకున్న వార్నర్.. ఆమె పశ్చాత్తాపానికి మెచ్చి ఆమెతో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ జంటకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు. కానీ తాను మరిచిపోయిన ఈ తప్పును ఇప్పటికీ చాలా మంది గుర్తు చేస్తూ తనను బాధిస్తుంటారని ఆమె వాపోయింది. 

ఇది కూడా చదవండి: KL Rahul: రాహుల్ కెప్టెన్సీపై పంజాబ్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తి.. వచ్చే ఏడాది ఆ జట్టుతో ఆడేది డౌటే..!

ఇందుకు సంబంధించిన విషయాలను ఆమె ఇటీవల ఓ రియాల్టి షోలో చెప్పుకుంటూ కన్నీరు మున్నీరైంది. వార్నర్ విఫలమైనప్పుడల్లా చాలా మంది ఆమెను ఆడిపోసుకోవడం.. 2018 లో డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు కూడా చాలా వేళ్లన్నీ కాండిస్ వైపే చూపాయి. ఆమెను బ్యాడ్ మదర్ అని, బ్యాడ్ వైఫ్ అని తిట్టిపోశాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోదామని అనుకున్నా.. పలువురు మాత్రం పదే పదే గుర్తు చేసి తనను మరింత వేదనకు గురి చేస్తున్నారని కాండిస్ కన్నీటిపర్యంతమయ్యింది. 

ఇదిలాఉండగా.. ఆనాడు కాండిస్ తో సెక్స్ చేస్తూ దొరికిపోయిన బిల్ విలియమ్స్.. తాజాగా ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో కాండిస్ ఉదంతాన్ని కూడా అతడు రాశాడు. దీంతో కాండిస్ వ్యవహారం మళ్లీ పత్రికలకు బ్యానర్ ఐటెం అయింది. గుట్టుగా సంసారం చేసుకుంటున్న  కాండిస్ ను ఇందులోకి లాగడం అవసరమా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios