సౌతాఫ్రికా- టీమిండియాల మధ్య ఇటీవలే టీ20 సీరిస్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు వేదికన జరిగిన టీ20 లో పర్యాటక జట్టు కోహ్లీసేనను చిత్తుచేసి సీరిస్ దక్కకుండా చేసింది. ఇదే మ్యాచ్ లో టీమిండియా సీనియర్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధవన్ ను  సౌతాఫ్రికా బౌలర్ శంషీ అవమానించేలా వ్యవహరించాడు. క్రీడా స్పూర్తిని దెబ్బతీసేలా అతిగా సంబరాలు చేసుకోవడమే కాకుండా సీనియర్ ప్లేయర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అతడిపై క్రికెట్ ప్రియులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

అభిమానుల విమర్శల సెగ తాకడంతో శంషీ తాజాగా తన సంబరాల గురించి వివరణ ఇచ్చుకున్నాడు. ''  ఎవరీనీ అవమానించడానికి తాను అలా సంబరాలు చేసుకోలేదు. కేవలం  ప్రేమ, ఎంజాయ్‌మెంట్ మరియు ఎంటర్టైన్‌మెంట్ కోసమే డిఫరెంగ్ గా ప్రయత్నించా. అయితే ధవన్ ఔటవడానికి ముందే క్రీజులో చాలా సరదాగా ముచ్చటించా. మొదటి రెండు బంతులను భారీ షాట్లు బాదకుండా ఎందుకు వదిలేశారు బిగ్ మ్యాన్ అని అడగ్గా ధవన్ సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. '' అంటూ శంషీ ట్వీట్ చేశాడు. 

స్వదేశంలో టీమిండియా మూడు టీ20మ్యాచుల సీరిస్ ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా ధర్మశాల మ్యాచ్ పూర్తిగా రద్దవగా మొహాలిలో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో బెంగళూరు వేదికన జరిగిన మూడో మ్యాచ్ సీరిస్ ఫలితాన్నినిర్ణయించింది. అలాంటి కీలక మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే ఆదిలోనే ఓపెనర్ రోహిత్ వికెట్ కోల్పోగా కెప్టెన్ కోహ్లీతో కలిసి ధవన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శంషీ వేసిన ఎనిమిద ఓవర్లో ధవన్ ఔటయ్యాడు. దీంతో శంషీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ధవన్  క్రీజును వీడుతుండగా వెంటనే తనకాలికున్న షూను తీసి చెవిదగ్గర పెట్టుకుని శంషీ కాస్త ఓవర్ గా సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడిపై అభిమానులు అతడిపై ఫైర్ అవగా తాజాగా వివరణ ఇచ్చుకున్నాడు. 

 

సంబంధిత వార్తలు

శంషీ షూతో కూడా ఫోన్ చేయగలడు... కావాలంటే ఇది చూడండి..: డస్సెన్