అంతర్జాతీయ క్రికెట్లో కొందరు ఆటగాళ్లు కేవల ఆటతోనే కాదు డిఫరెంట్ స్టైల్ తో బాగా ఫేమస్ అవుతుంటారు. అలా శ్రీలంక బౌలర్ లసింత్ మలింగ్, భారత యువ కెరటం బుమ్రాలు డిపరెంట్ బౌలింగ్ యాక్షన్ అభిమానులకు సుపరిచితమే. అలాగే కాట్రెల్, ఇమ్రాన్ తాహిర్ వంటి బౌలర్లు వికెట్ పడగొట్టిన తర్వాత డిపరెంట్ గా సంబరాలు చేసుకుంటారు. ఇక మరికొంత మంది ఆటగాళ్ళు సందర్భాన్ని బట్టి తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఇలా బెంగళూరు టీ20 లో సౌతాఫ్రికా బౌలర్ కూడా భారత ఓపెనర్ శిఖర్ ధవన్ వికెట్ పడగొట్టిన ఆనందంలో కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. షూ విప్పేసి అతడు చేసిన హంగామా కొందరికి సరదాను, మరికొందరు అభిమానులకు కోపాన్ని తెప్పించింది.

ఇంతకూ ఏం జరిగిందంటే... నిర్ణయాత్మక మూడో టీ20 లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే సఫారీ బౌలర్ల దాటికి ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి ధవన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బౌలర్ శంషీ వేసిన మొదటి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాది మంచి ఊపుమీద కనిపించాడు. 

అయితే ఆ తర్వాత ధవన్(25 బంతుల్లో 36 పరుగులు) శంషీ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. దీంతో బౌలర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ధవన్ పెవిలియన్ వైపు వెళుతుండగా శంషీ తన కాలికున్న షూను విప్పి కాస్త అతి చేశాడు. షూను చెవి దగ్గర పెట్టుకుని ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ధవన్ ను అవమానించేలా ప్రవర్తించాడు. దీంతో అతడు భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు.

శంషీ సంబరాలపై మ్యాచ్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాడ్ వాండర్ డస్సెన్ స్పందించాడు. '' శంషీకి సీనియర్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అంటే ఎంతో అభిమానం. అందువల్లే అతడి స్టైల్లో కాస్త డిఫరెంట్ గా సంబరాలు చేసుకోవాలని అనుకున్నట్లున్నాడు. అందువల్లే షూతో ఫోన్ చేస్తున్నట్లుగా యాక్ట్ చేశాడు. అతడలా తన షూతో తన క్రికెట్ హీరో తాహిర్ కే ఫోన్ చేసివుంటాడు.'' అని డస్సెస్ సరదాగా కామెంట్ చేశాడు.