Asianet News TeluguAsianet News Telugu

South Africa vs India, 1st ODI : బెంబేలేత్తించిన భారత బౌలర్లు .. 116 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్ల దెబ్బకు సఫారీ జట్టు పేక మేడలా కుప్పకూలింది. కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. 

South Africa vs India, 1st ODI :  Arshdeep takes 5, Avesh takes 4 as SA collapse to 116 all out ksp
Author
First Published Dec 17, 2023, 4:55 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్ల దెబ్బకు సఫారీ జట్టు పేక మేడలా కుప్పకూలింది. కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. సఫారీ జట్టులో టోనీ డీ జోర్జీ 28, పేలుక్వాయో 33 పరుగులు చేయడంతో ఆ జట్టు కనీసం 100 పరుగులైనా దాటగలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అయితే రెండో ఓవర్‌లోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. అర్షదీప్ బౌలింగ్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే వాండర్ డసెన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే మార్‌క్రమ్ , జోర్జిలు ప్రమాదకరంగా మారుతున్న దశలో మరోసారి అర్ష్‌దీప్ మ్యాజిక్ చేశాడు. ఓపెనర్ జోర్జి భారీ షాట్ కొట్టబోయి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్లాసెన్‌ను కూడా అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 

ఆ వెంటనే క్రమం తప్పకుండా దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. ఆవేశ్‌ఖాన్ వరుస బంతుల్లో ముల్లర్, మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్‌లను ఔట్ చేశాడు. అయితే చివరిలో ఫెలుక్వాయో దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 100 పరుగుల మార్క్‌ను దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఫెలుక్వాయోను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 25.1 ఓవర్లో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. చివరికి 27.3 ఓవర్‌లో దక్షిణాఫ్రికా  ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5, ఆవేశ్ ఖాన్ 4, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios