మారడోనాని మరిచిపోని సౌరవ్ గంగూలీ... వీడియో పోస్టు చేసి నివాళి...

ఓ అద్భుతమైన జీనియస్. నేను అతనికంటే బెటర్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను ఇంతవరకూ చూడలేదు...

సోషల్ మీడియా వేదికగా మారడోనాపై తన అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేసిన సౌరవ్ గంగూలీ...

 

Sourav Ganguly Tributes One special of his favorite Soccer Hero Maradona CRA

ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా నవంబర్ 25న గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ మరణించడంతో తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ... మరోసారి మారడోనాని గుర్తు చేసుకున్నాడు.

సోషల్ మీడియా వేదికగా మారడోనా గోల్స్ చేసిన వీడియోలను షేర్ చేసిన సౌరవ్ గంగూలీ... ‘ఓ అద్భుతమైన జీనియస్. నేను అతనికంటే బెటర్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను ఇంతవరకూ చూడలేదు’ అంటూ కామెంట్ చేశారు.

1986 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన గోల్‌ను ట్వీట్ కూడా చేశాడు సౌరవ్ గంగూలీ. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన మారడోనా... ఒకటి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పేర్కొన్నాడు. మరోకటి గోల్ ఆఫ్ సెంచురీగా ఖ్యాతి గాంచింది. మారడోనా మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణకు ఆదేశించింది అర్జెంటీనా ప్రభుత్వం. మారడోనాకి వైద్యం చేసిన డాక్టర్లపై సందేహాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios