Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న గంగూలీ...? ఆయన సమాధానమిదే..

గంగూలీ ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ, టీఎంసీ పోటీలు పడుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీల నాయకులు గంగూలీని కలిశారనే వార్తలు వచ్చాయి. 

Sourav Ganguly refrains from political endeavours for the time being
Author
Hyderabad, First Published Mar 9, 2021, 8:22 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? గత కొంతకాలంగా ఈ విషయానికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. గంగూలీ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదా రాజకీయ రంగం ప్రవేశం గురించి చర్చ నడుస్తోంది.

గంగూలీ ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ, టీఎంసీ పోటీలు పడుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీల నాయకులు గంగూలీని కలిశారనే వార్తలు వచ్చాయి. కానీ దాదా వీటిని ఖండించారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా గంగూలీ భవిష్యత్‌ ప్రణాళిక ఏంటని ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. ‘‘జీవితం ఎటు పోతుందో.. ఏం జరుగుతుందో’’ చూడాలి అంటూ బదులిచ్చారు దాదా. 

దేశవ్యాప్తంగా తనకున్న పాపులారిటీపై స్పందిస్తూ గంగూలీ.. ‘‘అదృష్టం కొద్ది నాకు చాలా మంది ప్రేమాభిమానాలు లభించాయి. నేనిది ఊహించలేదు. నా పని నేను చేశాను. కోల్‌కతాలో నేను సాధారణ జీవితం గడిపాను. ప్రజలను కలవడం.. వారితో మాట్లాడటం.. వారితో సమయం గడపటం నా నైజం. నేనలాగే ఉంటాను’’ అన్నారు.

అలానే ‘‘నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను. కాకపోతే ఎవరితోనూ ఎక్కువ సేపు గడపలేను. నేను చాలా ఫేమస్‌ కాబట్టి.. జనాలు నన్ను కలవాలంటే కష్టం అనే మాటలను నేను నమ్మను. నా జీవితం నేను గడుపుతున్నాను.. అందువల్లే ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారని భావిస్తాను’’ అన్నారు. 

ఇదిలా ఉండగా... ఇటీవల ఆయన రెండు సార్లు హార్ట్ ఎటాక్ కి గురయ్యారు. చికిత్స తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios