Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన టీమిండియా.. సౌరవ్ గంగూలీ రెస్పాన్స్ ఇదే..!

ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తట్టుకోలేకపోయారు.
 

Sourav Ganguly After India's Thumping Win Over England In 4th Test
Author
hyderabad, First Published Sep 7, 2021, 9:35 AM IST

ఇంగ్లాండ్ పై టీమిండియా నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. 50ఏళ్ల నాటి రికార్డ్ ని టీమిండియా తిరగ రాసింది. ఈ విజయం పట్ల  భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ విజయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు.

మిగిలిన అన్ని జట్లకంటే.. టీమిండియా ముందంజలో ఉందని ఆయన అన్నారు. జట్టు గొప్ప ప్రదర్శన కనపరిచిందని ఆయన అన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలుగుతారని.. ఆ శక్తి తమ జట్టుకి ఉందంటూ.. గంగూలీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉండగా.. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తట్టుకోలేకపోయారు.


దీంతో తో 210 పరుగులకే… రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ ధాటికి… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు వరుసగా పెవిలియన్ కు దారి పట్టారు. ఓపెనర్ బర్న్స్ 50 పరుగులు, ఆసీస్ హమీద్ 63 పరుగులు మరియు కెప్టెన్ రూట్ 36 పరుగులు మినహా ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు.

దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఇండియా బౌలర్ల లో ఉమేష్ యాదవ్ 3, బుమ్ర 2, జడేజా 2, ఠాకూర్ 2 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (127, 256 బంతుల్లో), కేఎల్ రాహుల్ (46), పుజారా (61), కోహ్లీ (44), పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) ఆశించిన స్థాయిలో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన పరుగులను అధిగమించడంతో పాటు భారీ ఆధిక్యాన్ని సంపాదించుకోగలిగింది. తొలి, రెండో ఇన్నింగ్సులో శార్దూల్ ఠాకూర్ (57, 60) రాణించడంతో భారత్‌కు కాస్త ఊరట కలిగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios