కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ రద్దు అయిన సంగతి తెలిసిందే. బయో బుబల్ లో క్రికెటర్లను ఉంచి మరీ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఐపీఎల్ నిర్వహించినప్పటికీ.. క్రికెటర్లు కరోనా బారినపడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్ రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో.. ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పమ్మెంట్ తాజాగా ఐపీఎల్ రద్దు అవ్వడంపై చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి. కొందరు సీనియర్ ఇండియన్ క్రికెటర్లు.. తమను రిస్ట్రిక్ట్ చేయడానికి ఇష్టపడరని.. దానికి మేం ఏమి చేయలమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. దీంతో.. ఆ సీనియర్ క్రికెటర్లు ఎవరై ఉంటారనే చర్చ మొదలైంది. ఆ సీనియర్ క్రికెటర్లు బయో బబుల్ లో ఉండటానికి ఇష్టపడలేదా..? దాని వల్లే కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే... ఆయన ఏ క్రికెటర్ పేరు బయట పెట్టకపోవడం గమనార్హం. అయితే.. బయో బబుల్ కారణంగా తాము సురక్షితంగా ఉన్నామని తనకు నమ్మకం కలిగిందన్నారు. బయో బబుల్ ని ఎలాంటి సమయంలోనూ రాజీ పడాల్సివస్తుందని తాము అనుకోలేదని ఆయన పేర్కొన్నారు.

కానీ ఎప్పుడైతే కొందరు క్రికెటర్లు కరోనా బారినపడ్డారో అప్పు అందరం భయపడినట్లు చెప్పారు. ముందు చెన్నై జట్టులో క్రికెటర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకముందే తాము చెన్నై ఆటగాళ్లతో క్రికెట్ ఆడటంతో చాలా భయం వేసినట్లు చెప్పారు.