స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్మృతి ఇన్ డా ఘెట్టో' అనే వైరల్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఆమెతో పాటు పలువురు స్నేహితులు కూడా అందులో ఉన్నారు. 


క్రికెటర్లంతా.. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా.. వారికి కూడా ఇతర సరదాలు ఉంటాయి. మన టీమిండియా క్రికెటర్లు ఇప్పటి వరకు చాలా మంది తమలో ఉన్న ఇతర టాలెంట్స్ ని చాలా సార్లు బయటపెట్టారు. తాజాగా.. టీమిండియా మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంథానా ( Smriti Mandhana) తన స్పెషల్ టాలెంట్ బయట పెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో స్మృతి ఇన్ డా ఘెట్టో' అనే వైరల్ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. ఆమెతో పాటు పలువురు స్నేహితులు కూడా అందులో ఉన్నారు.

View post on Instagram

ఆమె డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్మృతీ మంధానతోపాటు.. ఆమె స్నేహితులు, టీమిండియా మహిళ జట్టు క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్ కూడా ఉండటం గమనార్హం. వారంతా డ్యాన్స్ సూపర్ గా వేశారు.

ఈ వీడియో షేర్ చేసిన మంథన.. వీడియో చేయాలనే ఆలోచన అయితే.. తనది కాదంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఎవరూ జడ్జ్ చేయవద్దని.. తనతో బలవంతంగా ఈ వీడియో చేయించారంటూ ఆమె క్యాప్షన్ లో పేర్కొనడం విశేషం. అయితే.. ఆమె క్యాప్షన్ కి.. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ ఫన్నీ కామెంట్ చేశారు. ఇది కచ్చితంగా స్మృతీ మంథనా ఐడియానే అయ్యి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు.. బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉండటం గమనార్హం.