IPL 2022: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో ఫన్ తో పాటు పలు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో తన ప్రవర్తన, అతి వల్ల వార్తల్లో నిలిచిన  ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ కు చెందిన రియాన్ పరాగ్.. 

ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఓ లీగ్ మ్యాచ్ లో రియాన్ పరాగ్.. తన అతి ప్రవర్తనతో సీనియర్ ప్లేయర్లైన హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ లతో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ఘటనకు సంబంధించి రియాన్ పరాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో తాను హర్షల్ ను అభ్యంతరకరంగా ఏమీ అనలేదని.. కానీ మహ్మద్ సిరాజ్ నాతో వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చాడు.

పరాగ్ మాట్లాడుతూ.. ‘గతేడాది ఐపీఎల్ లో నేను హర్షల్ బౌలింగ్ లో ఔటయ్యా. అప్పుడు నన్ను అక్కడ్నుంచి వెళ్లిపో అన్నట్టుగా అతడు సైగ చేశాడు. అయితే అది నేను మైదానంలో చూడలేదు. పెవిలియన్ కు వెళ్లాక టీవీ రిప్లైలలో చూశాను. 

అప్పట్నుంచి నా మనసులో అది అలాగే ఉండిపోయింది.ఇక ఈ సీజన్ లో ఆర్సీబీతో మ్యాచ్ లో హర్షల్ బౌలింగ్ లో నేను రెండు సిక్సర్లు కొట్టడంతో గతంలో అతడు ఎలా చేశాడో నేనూ అదే చేశాను. ఎవరినీ తిట్టలేదు. ఏ అభ్యంతరకరమైన మాటలూ అనలేదు. హర్షల్ కూడా అప్పుడు ఏమీ అనలేదు. కానీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మహ్మద్ సిరాజ్ నన్ను పిలిచి.. ‘పిల్లాడివి పిల్లాడిలా ప్రవర్తించు.’అని నాతో చెప్పాడు. అప్పుడు నేను పరాగ్ తో.. నేను నీతో ఏం చెప్పదలుచుకోలేదు భయ్యా.. అని చెప్పాను. అప్పటికే మా ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి మమ్మల్ని ఆపారు.. అంతే జరిగింది..’అని చెప్పాడు.

Scroll to load tweet…

అయితే మ్యాచ్ అనంతరం హర్షల్ తనకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నాకు ఇమ్మెట్యూర్ గా అనిపించిందని పరాగ్ వివరించాడు. ‘మ్యాచ్ అయిపోయాక నేను అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాను. కానీ హర్షల్ మాత్రం నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అది నాకు ఇమ్మచ్యూర్ గా తోచింది..’ అని చెప్పుకొచ్చాడు. 

ప్లేఆఫ్స్ లో గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ లో కూడా అశ్విన్ తనను రనౌట్ చేయించడం పై కూడా పరాగ్ స్పందించాడు. ‘నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్ పరిగెత్తాల్సిందే. ఆ టైంలో నేను ఆశ్చర్యపోయాను. అందుకే వెనక్కి తిరిగి అశ్విన్ వైపునకు చూసి నడుచుకుంటూ పోయాను. అయితే మ్యాచ్ అనంతరం అశ్విన్ నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. ఆ సమయంలో తాను వేరే ఆలోచిస్తున్నానని నాతో చెప్పాడు..’ అని తెలిపాడు. 

Scroll to load tweet…