బాబర్ ఆజమ్, టాప్ ర్యాంక్‌ని కాపాడిన టీమిండియా... మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇవ్వడంతో..
847 పాయింట్లకు చేరుకున్న శుబ్‌మన్ గిల్, 857 పాయింట్లతో టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్... ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇవ్వడంతో..
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, నెం.1 ర్యాంకుని కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ అదరగొట్టినా, నెం.1 ర్యాంకుని మాత్రం అందుకోలేకపోయాడు..
అయితే 847 పాయింట్లకు చేరుకున్న శుబ్‌మన్ గిల్, 857 పాయింట్లతో టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కి 10 పాయింట్ల దూరంలో ఆగాడు. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్, 30+ స్కోరు చేసినా నెం.1 వన్డే బ్యాటర్‌గా అయ్యేవాడు..
అయితే వరుసగా మ్యాచులు ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఒక్క మ్యాచ్‌లో విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్.. ఈ నిర్ణయంతో బతికిపోయిన బాబర్ ఆజమ్, నెం.1 వన్డే బ్యాటర్‌గా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ప్రారంభించబోతున్నాడు..
అక్టోబర్ 6న పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మొదటి మ్యాచ్ ఆడుతోంది. జింబాబ్వే, నెదర్లాండ్స్, హంగ్‌కాంగ్ వంటి పసికూనలపై బాబర్ ఆజమ్ వీర లెవెల్లో చెలరేగిపోతాడు. ఆసియా కప్ 2023 టోర్నీలోనూ నేపాల్‌తో మ్యాచ్‌లో 151 పరుగులు చేసి ప్రతాపం చూపించాడు బాబర్ ఆజమ్. ఆ తర్వాత మిగిలిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే, బాబర్ ఆజమ్ తన వన్డే నెం.1 ర్యాంకును కాపాడుకోగలడు. లేదంటే చెన్నైలో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ బాగా ఆడితే... నెం.1 బ్యాటర్‌గా నిలుస్తాడు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఈ ఇద్దరి పర్ఫామెన్స్, ఐసీసీ ర్యాంకింగ్స్‌ని డిసైడ్ చేయనుంది. విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 9లో ఉంటే, రోహిత్ శర్మ మళ్లీ 11వ స్థానానికి పడిపోయాడు.
ఐసీసీ వన్డే నెం.1 బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ తన ర్యాంకును కాపాడుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 10వ స్థానంలో ఉన్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా టాప్ 7లో ఉన్నాడు.