విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలను వెనక్కినెట్టి.. శుభ్‌మన్ గిల్ జోరు !
BCCI awards: 2022-23 సంవత్సరానికి గాను శుభ్‌మన్ గిల్ కు బీసీసీఐ పాలీ ఉమ్రిగర్ అవార్డును ప్రదానం చేసింది. అలాగే, భారత క్రికెట్ బోర్డు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా గిల్ ను ఎంపిక చేసింది. 2022, 2023 లో అతన అద్భుతమైన ఆటతీరుతో గిల్ ఆకట్టుకున్నాడు.
BCCI awards-shubhman gill: టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన బీసీసీఐ అవార్డుల్లో జోరు కొనసాగించాడు. 2022-23 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా శుభ్‌మన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. గత ఏడాది భారత ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2023 వరల్డ్ కప్ లో గిల్ బ్యాట్ తో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వెనక్కి నెట్టి భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ప్రత్యేక అవార్డును గెలుచుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ కు పాలీ ఉమ్రిగర్ సత్కారం కూడా..
శుభ్‌మన్ గిల్ 2022-23 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ నిలవడంతో పాటు పాలీ ఉమ్రిగర్ అవార్డును కూడా అందుకున్నాడు. 2022-23 సంవత్సరానికి గాను శుభ్‌మన్ గిల్ కు బీసీసీఐ పాలీ ఉమ్రిగర్ అవార్డును ప్రదానం చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ లో రాణించి చిరస్మరణీయం ఇన్నింగ్స్ లు ఆడాడు. 2022 వన్డే క్రికెట్లో ఆడిన 12 మ్యాచ్ లలో శుభ్‌మన్ గిల్ 70.88 సగటుతో 638 పరుగులు చేశాడు. అదే సమయంలో 2023లో గిల్ 29 వన్డేల్లో 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు.
India Vs England: ముప్పు పొంచి ఉంది.. బాజ్ బాల్ పై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు బీసీసీఐ పురస్కారాలు
జస్ప్రీత్ బుమ్రాకు 2021-22 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా 2022లో అద్భుతంగా బౌలింగ్ చేసి వన్డే క్రికెట్లో 5 మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు క్రికెట్ లో బుమ్రా 5 మ్యాచ్ లలో 22 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆడిన 9 టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్ 30 వికెట్లు పడగొట్టడం విశేషం.
2019-20 సంవత్సరానికి గాను భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. 2019లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన షమీ టెస్టు క్రికెట్ లో 33 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో వన్డే క్రికెట్లో షమీ 21 మ్యాచ్ లలో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ లోనూ షమీ అద్భుత ప్రదర్శనలో ఆకట్టుకున్నాడు. కేవలం 7 మ్యాచ్ లు ఆడి 23 వికెట్లు తీసుకుని ఐసీసీ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ లేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే..