Year Ender 2023: వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌ను వెనక్కి నెట్టిన శుభ్‌మన్ గిల్

ఈ ఏడాది వన్డే మ్యాచ్‌లలో భారత బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. టాప్ మూడు స్థానాల్లో మనోళ్లే ఉన్నారు. అత్యధికంగా శుభ్‌మన్ గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే.. అత్యధిక ఫోర్లు, సిక్స్‌లు కొట్టింది కూడా మనోళ్లే.
 

shubhman gill top scorer in odis in 2023, ahead of virat kohli and rohit sharma in the batsmen list kms

Year Ender 2023: ఈ ఏడాది వన్డేల్లో మన బ్యాట్స్‌మెన్లు ఇరగదీశారు. కొత్త కెరటం శుభ్‌మన్ గిల్ తన సత్తా చూపాడు. ఈ ఏడాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు, అత్యధిక ఫోర్లు(180 ఫోర్లు) దంచిన బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అత్యధిక సిక్స్‌లు(67 సిక్స్‌లు) బాదిన బ్యాట్స్‌‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శుభ్‌మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. 

శుభ్‌మన్ గిల్:

ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ 29 మ్యాచ్‌లలో 1584 పరుగులు(29 ఇన్నింగ్స్‌లో) సాధించాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 208. ఈ మ్యాచ్‌లలో మొత్తంగా 180 ఫోర్లు, 41 సిక్స్‌లు బాదాడు.

విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ ఈ ఏడాది టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 27 మ్యాచ్‌లలో 24 ఇన్నింగ్స్‌లలో మాత్రమే ఆడాడు. ఇందులో 1377 పరుగులు రాబట్టాడు. అత్యధిక స్కోర్‌గా అజేయ 166 పరుగులు. ఈయన 122 ఫోర్లు, 24 సిక్స్‌లు కొట్టాడు.

రోహిత్ శర్మ:

27 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1255 రన్స్ కొట్టాడు. హైయెస్ట్ 131 రన్స్. 131 ఫోర్లు, 67 సిక్స్‌లు బాదాడు. ఈ ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్ రోహిత శర్మనే.

డీజే మిచెల్:

26 మ్యాచ్‌లలో 25 ఇన్నింగ్స్‌లో స్ట్రైకింగ్ తీసుకుని 1204 రన్స్ సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆటగాడు 93 ఫోర్లు, 37 సిక్స్‌లు కొట్టాడు.

పి నిస్సంకా:

29 మ్యాచ్‌లలో 29 ఇన్నింగ్స్‌లు ఆడి 1151 పరుగులు సాధించాడు.ఈ శ్రీలంక బ్యాట్స్‌మన్ 156 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు.

Also Read: MS Dhoni: సచిన్ తర్వాత మళ్లీ ధోనీకే ఆ గౌరవం.. ఐకానిక్ జెర్సీ 7 మాహీకే అంకితం.. ఇక కనిపించదంతే!

బాబర్ ఆజాం:

25 మ్యాచ్‌లకు గాను 24 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ 97 ఫోర్లు, 14 సిక్స్‌లు బాదాడు.

మొహమ్మద్ రిజ్వాన్:

ఈ పాకిస్తాన్ ఆటగాడు 25 మ్యాచ్‌లకు గాను 23 ఇన్నింగ్స్‌లలో 95 ఫోర్లు, 12 సిక్స్‌లతో 1023 పరుగులు కొట్టాడు.

డీజే మలాన్:

18 మ్యాచ్‌లలో 995 పరుగులు కొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మలాన్ ఈ ఏడాది 110 ఫోర్లు, 24 సిక్స్‌లు బాదాడు.

ఏకే మర్క్రం:

దక్షిణాఫ్రికాకు చెందిన మర్క్రం 21 మ్యాచ్‌లలో 97 ఫోర్లు, 29 సిక్స్‌లతో 983 పరుగులు సాధించాడు. 

కేఎల్ రాహుల్:

24 మ్యాచ్‌లకుగాను 22 ఇన్నింగ్స్‌లలో 983 రన్స్ కొట్టాడు. 111 నాటౌట్ హైయెస్ట్ రన్స్. 84 ఫోర్లు, 18 సిక్స్‌లు సాధించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios