పాక్ క్రికెటర్ కనేరియాను హిందు అనే కారణంతో వివక్ష  చూపించారంటూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలనం సృష్టించాడు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్తర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ కనేరియా వివరణ కూడా ఇచ్చాడు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో.. అక్తర్ మరో బాంబ్ పేల్చాడు.

తమ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కి సంబంధించిన ఓ వీడియోని బయటపెట్టాడు. అది మరిన్ని దుమారాలు రేపేలా కనపడుతోంది. అక్తర్ విడుదల చేసిన వీడియోలో అక్రమ్... పాక్ క్రికెట్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బయటపెట్టాడు.

ఆ వీడియోలొ అక్రమ్ మాట్లాడుతూ..‘‘ అచ్చం గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇది మన క్రికెట్ ను ధ్వంసం చేస్తుంది. ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు కొత్త పద్ధుతులు తీసుకురావాలి. మన ఆలోచనా విధానాలు కూడా మారాలి. అందుకోసం కొత్తగా ప్రయత్నించాలి.’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోని ఇప్పుడు అక్తర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అంతేకాకుండా తాను వసీం అక్రమ్  చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు చెప్పాడు. పాక్ క్రికెట్ లో మార్పులు అవసరమని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.