పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడు. తాజాగా.. మరోసారి అలాంటి కామెంట్స్ చేశాడు. ఇండియన్ క్రికెటర్ సెహ్వాగ్ ని కొట్టేవాడినంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ‘షోయబ్ అక్తర్ నన్ను అదేపనిగా స్లెడ్జింగ్ చేస్తున్నాడు. బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను నాన్‌స్ట్రైకర్ వైపు మీ బాబు నిలబడి ఉన్నాడు.. అతడికి చెప్పు అతడు కొట్టి చూపిస్తాడు.. నాన్‌స్ట్రైకర్‌లో సచిన్ ఉన్నాడు..

’ పాక్-ఇండియా జట్ల మధ్య జరిగే స్లెడ్జింగ్‌ గురించి సెహ్వాగ్ చెప్పిన మాటలివి. అయితే సెహ్వాగ్ మాటలు ప్రపంచ దేశాలు మొత్తం మార్మోగుతున్నా షోయబ్ మాత్రం ఇన్నేళ్ల తర్వాత మేల్కొన్నట్లున్నాడు. ఇటీవల ఓ వీడియోలో అక్తర్ మాట్లాడాడు. ‘సెహ్వాగ్ ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే నేను వదిలిపెట్టేవాడినా..? కచ్చితంగా గ్రౌండ్‌లోనే చితకబాదేవాడిని. తర్వాత హోటల్‌లో కూడా కొట్టేవాడిని’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి దీనిపై మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.