Asianet News TeluguAsianet News Telugu

షార్జాలో ‘డిసర్ట్ స్ట్రోమ్’కు 25 ఏండ్లు.. సచిన్ పుట్టినరోజున మరో గౌరవం..

Sachin Tendulkar: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్  సోమవారం తన 50వ   పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షార్జా క్రికెట్  అసోసియేషన్ మాస్టర్ బ్లాస్టర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 

Sharjah Cricket Stadium Named West Stand   to Sachin Tendulkar stand MSV
Author
First Published Apr 25, 2023, 10:39 AM IST

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 50 వ పుట్టినరోజు సందర్భంగా  షార్జా క్రికెట్ అతడికి  ఊహించిన గిఫ్ట్ ఇచ్చింది.  షార్జాలోని అంతర్జాతీయ  క్రికెట్ స్టేడియంలో  వెస్ట్ స్టాండ్ కు మాస్టర్ బ్లాస్టర్ పేరు పెట్టింది.  షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ సృష్టించిన ‘డిసర్ట్ స్ట్రోమ్’కు 25 ఏండ్లు పూర్తయిన సందర్భంతో పాటు  సచిన్ బర్త్ డే కూడా కలిసిరావడంతో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

1998లో ఏప్రిల్ 22న సచిన్..  కోకోకోలా కప్ లో భాగంగా ఆస్ట్రేలియాపై ఆడిన  (134 బంతుల్లో 143) ఇన్నింగ్స్ ను ‘డిసర్ట్ స్ట్రోమ్’ గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే  ‘సచిన్ డిసర్ట్ స్ట్రోమ్’పై  షార్జాలో అభిమానులు వేడుకలు కూడా చేసుకున్నారు.  

ఇక సచిన్  50వ బర్త్ డే ను పురస్కరించుకుని  షార్జా క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. షార్జా క్రికెట్ సీఈవో ఖలఫ్ బుక్తార్  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి   స్టేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్ ను  ప్రారంభించారు.  అనంతరం  సచిన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ను ప్రత్యేక ప్రదర్శన వేశారు.  

 

డిసర్ట్ స్ట్రోమ్ కథ ఇది.. 

సరిగ్గా 25 ఏండ్ల క్రితం.. 1998లో యూఏఈ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్  జట్లు  కోకోకోలా కప్ ఆడాయి.    ఇండియా - ఆస్ట్రేలియా  మధ్య  సరిగ్గా ఇదే తేదీ (ఏప్రిల్ 22) న  మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్..  50 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  284 పరుగులు చేసింది.  మైఖేల్ బెవాన్ (101) సెంచరీ చేశాడు. ఛేదనలో  భారత్ తడబడింది.  సౌరవ్ గంగూలీ (17), నయాన్ మోంగియా (35), కెప్టెన్ అజారుద్దీన్ (14), అజయ్ జడేజా  (1), వీవీఎస్ లక్ష్మణ్ (23) అంతా విఫలమయ్యారు. కానీ సచిన్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. 131 బంతుల్లో  9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 143 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కు ఇసుక తుఫాను అంతరాయం కలిగించింది. కానీ అది ముగిశాక సచిన్ తుఫాను మొదలైంది. 

సిడ్నీ  క్రికెట్ గ్రౌండ్ గేట్ కూ సచిన్ పేరు..    

నిన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)  కూడా సచిన్‌కు అరుదైన గౌరవం అందించిన విషయం తెలిసిందే. ఎస్‌సీజీలోని  ఓ  గేటుకు సచిన్  పేరును పెట్టింది.  ఇదే క్రమంలో సచిన్ కు సన్నిహితుడు, అతడి స్నేహితుడు  వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాను కూడా ఇలాగే గౌరవించింది. సచిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎస్‌సీజీ..   స్టేడియంలోకి విజిటింగ్ క్రికెటర్లు   ప్రవేశించే గేట్ కు సచిన్   పేరుపెట్టింది.  ఎస్‌సీజీలో    బ్రాడ్‌మన్ మెసేంజర్ స్టాండ్, మెంబర్స్ పెవిలియన్ మధ్యలో ఈ గేట్లు ఉన్నాయి.  విజిటింగ్ క్రికెటర్లు ఈ ద్వారం గుండానే  లోపలికి ప్రవేశిస్తారు. 

 

ఇదే విషయమై సచిన్ స్పందిస్తూ.. ‘భారత్ తర్వాత  నాకు  ఇష్టమైన  క్రికెట్ గ్రౌండ్  ఎస్‌సీజీ.  నేను 1991-92లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి.విజిటింగ్ క్రికెటర్ల ప్రవేశద్వారమైన గేట్లకు నా, నా స్నేహితుడు బ్రియాన్ లారా పేరు పెట్టినందుకు   నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎస్‌సీజీకి ధన్యవాదాలు.  నేను త్వరలోనే  సిడ్నీని సందర్శిస్తాను’అని పేర్కొన్నాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios