పాకిస్తాన్ క్రికెటర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఫైరయ్యారు. వాళ్లు కాస్త సిగ్గు తెచ్చుకోవాలని.. ఐసీసీ వారిపై జరిమానాలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఆయన ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం ఏంటంటే... గతేడాది వన్డే ప్రపంచకప్‌ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌కు సంబంధించి కోహ్లీ-రోహిత్ భారీ భాగస్వామ్యం, ధోనీ ఆటతీరుపై ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ ‘‘ఆన్ ఫైర్’’ పుస్తకంలో తాను ఆశ్చర్యపడినట్లు రాశాడు. దీని ఆధారంగా టీమిండియా కావాలనే ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయి, పాకిస్తాన్‌ నాకౌట్‌ అవకాశాలను సంక్షిష్టం చేసిందంటూ రమీజ్ రాజా, అబ్ధుల్ రజాక్ వంటి పాక్ క్రికెటర్లు విమర్శించారు.

Also Read:చచ్చిపోదామనుకున్నా.. క్రికెటర్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

దీనిపై స్పందించిన ఆకాశ్ చోప్రా... తాను టీ షర్ట్ ధరించాను, దాని మీద సిగ్గులేదని రాసుంది. కాస్త ఆలోచించి సిగ్గు తెచ్చుకోండి. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి టీమిండియా ఉద్దేశ్యపూర్వకంగా ఓడిపోయిందని వకార్ యూనిస్ అంటున్నాడని ఆకాశ్ విమర్శించాడు.

కోహ్లీ- రోహిత్ భాగస్వామ్యంలో అర్ధం లేదని, ధోనీ ఆటతీరు ఆశ్చర్యపరిచిందని స్టోక్స్ రాయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అతనెక్కడా కోహ్లీ సేన ఉద్దేశ్యపూర్వకంగా ఓడిపోయిందని చెప్పలేదుగా అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

Also Read:బీసీసీఐ ప్రణాళికలు: దుబాయిలో ఐపీఎల్ 2020...?

టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాహాటంగానే అంటున్నారు. వారిపై ఐసీసీ జరిమానా విధించాలని ఆకాశ్ డిమాండ్ చేశాడు. ఆ పరిస్ధితుల్లో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉండటం అత్యవసరం. గ్రూప్ దశలో టీమిండియా ఒక్కటే మ్యాచ్ ఓడింది. అదీ ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలోనే అని ఆకాశ్ గుర్తుచేశాడు.