ప్రస్తుతం ధాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న షకీబ్ అల్ హసన్... ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌పై  అసహనం... లైవ్ టెలికాస్ట్ కావడంతో వైరల్ అవుతున్న వీడియోలు...

బంగ్లా మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ధాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న షకీబ్ అల్ హసన్, ప్రాక్టీస్ మ్యాచ్‌లో తీవ్ర ఆవేశానికి గురై, అంపైర్‌పై తన అసహనాన్ని ప్రదర్శించాడు.

బౌలింగ్‌కి వచ్చిన షకీబ్ అల్ హసన్, ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశాడు. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో తీవ్ర ఆసహనంతో వికెట్లను కాళ్లతో తన్ని పడగొట్టాడు.

Scroll to load tweet…


ఆ తర్వాత మరో బౌలర్ బౌలింగ్‌లో కూడా అంపైర్ ఇచ్చిన నిర్ణయంతో మండిపడిన షకీబ్ అల్ హసన్, కోపంగా అతని ముందుకొచ్చి వికెట్లను తీసి నేలకేసి కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం కావడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.

Scroll to load tweet…

ఏ మాత్రం క్రీడాస్ఫూర్తి లేకుండా క్రీజులో అంపైర్‌తో అమర్యాదగా ప్రవర్తించిన షకీబ్ అల్ హసన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఏడాదిపాటు నిషేధానికి గురైన షకీబ్ అల్ హసన్ మరోసారి క్రమశిక్షణారాహిత్యానికి శిక్ష అనుభవించే అవకాశం ఉంది.