Shakib Al Hasan: బంగ్లాదేశ్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ అల్ హసన్.. మగురా-1 జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, బంగ్లా క్రికెట్ టీమ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Shakib Al Hasan slaps fan: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మగురా-1 స్థానం నుంచి షకీబ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయ‌న ఎన్నిక త‌ర్వాత‌ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. షకీబ్ అల్ హసన్ ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ లో జరిగిన ప్రపంచకప్ లో ఆడిన 9 లీగ్ మ్యాచ్ ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన బంగ్లాదేశ్ ఏడు మ్యాచ్ ల్లో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ లో షకీబ్ అల్ హసన్ ఏడు మ్యాచ్ ల‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో అతను 186 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి బంగ్లా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే అతను ఇంకా క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. క్రికెట్ నుంచి రిటైర్ కాకముందే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత షకీబ్ అల్ హసన్ కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ల‌భించింది.

భారత్ కు బిగ్ షాక్.. IND VS ENG సిరీస్ నుంచి మ‌హ్మ‌ద్ ష‌మీ ఔట్.. !

తన సొంత నియోజకవర్గమైన మకుర నియోజకవర్గంలో బోటు (బోట్) గుర్తుపై పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు. అయితే, షకీబ్ అల్ హసన్ తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన అభిమానులు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న‌ ఓ అభిమాని చెప్ప‌పై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scroll to load tweet…

షకీబ్ అల్ హసన్ వివాదాల్లో చిక్కుకోవ‌డం ఇదే మొద‌టిసారి కాదు. మైదానంలో లేదా వెలుపల చాలా సార్లు వివాదాల్లో ప‌డ్డారు. 2023లో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఓ అభిమానిని భారీ భద్రత నడుమ కొట్టిన వీడియో వైరల్ గా మారింది. మైదానంలో కూడా షకీబ్ పలు వివాదాస్పద ఘటనల్లో పాల్గొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ప‌ట్ల న‌డుచుకున్న తీరు హాట్ టాపిక్ అయింది.

IND vs AFG: సూపర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు?