భారత్ కు బిగ్ షాక్.. IND vs ENG సిరీస్ నుంచి మహ్మద్ షమీ ఔట్.. !
IND vs ENG: 2023 ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో రికార్డు స్థాయిలో 24 వికెట్లు తీసిన టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. గాయం కారణంగా క్రికెట్ కు దూరం అయ్యాడు. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు కూడా దూరం కానున్నాడని సమాచారం.
Mohammed Shami
IND vs ENG - Mohammed Shami: ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐసీసీ టెస్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ మూడో ఎడిషన్ లో భారత జట్టు ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ క్రమంలోనే భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
Mohammed Shami
భారత్-ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు తొలి రెండు మ్యాచ్ లకు సీనియర్, స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ దూరం కానున్నాడని సమాచారం. షమీ సేవలను కోల్పోవడంతో టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
mohammed shami
ప్రస్తుతం శిక్షణ శిబిరంలో కోలుకుంటున్న మహ్మద్ షమీ జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్ లలో ఆడే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'షమీ ఇంకా బౌలింగ్ ప్రారంభించలేదు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి ఫిట్నెస్ టెస్ట్ లో పాల్గొననున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో అతడు ఆడటం అనుమానమే. హెర్నియా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన సూర్యకుమార్ యాదవ్ కోలుకోవడానికి సమయం కావాలి. శస్త్రచికిత్స తర్వాత వారికి 8-9 వారాలు అవసరం. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే సమయానికి అతను కోలుకునే అవకాశం ఉంది' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయని పలు రిపోర్టులు నివేదించాయి.
Mohammed Shami
అంతకుముందు, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో మహ్మద్ షమీకి చోటుకల్పించకుండా, గాయం కారణంగా వైట్ బాల్ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతని స్థానంలో అవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నారు.
Mohammed Shami
ఇంగ్లాండ్ తో భారత్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. మహ్మద్ షమీ ఫిట్ నెస్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పేసర్ పూర్తిగా కోలుకునేలా చూడటమే తొలి ప్రాధాన్యంగా నొక్కి చెప్పింది.
Mohammed Shami
అయితే, ఇంగ్లాండ్ సిరీస్ కు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారు. భారత్ లో టెస్టు సిరీస్ జరుగుతుండటంతో ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీం ఇండియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేయడంతో ఫాస్ట్ బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ నుంచి సిరాజ్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి టెస్టు క్రికెట్ కు సిద్ధం కావాలని బీసీసీఐ కోరిందని సమాచారం.