కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే స్తంభించిపోయింది. క్రికెట్ తో సహా అన్ని క్రీడలు కూడా అటకెక్కాయి. విశ్వా క్రీడాసంరంభం ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.  ఐపీఎల్ పై కూడా  అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 

ఇక ఈ కరోనా వైరస్ నేపథ్యంలో క్రికెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పాకిస్తాన్ ఇంగ్లాండ్ పయనమైంది. విండీస్ తో ఇంగ్లాండ్ సిరీస్  ఆడనుంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉండడంతో బబుల్ వాతావరణంలో ఈ మ్యాచులను నిర్వహిస్తున్నారు 

ఇక ఈ కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ క్రికెట్‌లో పలు మార్పులకు కారణం అవుతోంది. కోవిడ్‌-19 ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్రికెట్‌లో ఉమ్మిపై నిషేధం సైతం విధించారు. 

గతంలో మాదిరి మైదానంలోకి అడుగుపెట్టే ముందు జట్టంతా ఒకరి భుజాలపై చేతులేసుకుని గుంపుగా చేరి మాట్లాడుకోవటం(హడిల్) ఇక చూడలేం. వికెట్‌ పడినప్పుడు ఆటగాళ్లందరూ బౌలర్‌ను హత్తుకుని అభినందించటం ఇక కొంత కాలం చరిత్రే!. 

బ్యాట్స్‌మన్‌ బౌండరీలు, అర్థ సెంచరీ, శతకం బాదినప్పుడు సహచర బ్యాట్స్‌మన్‌ ఆలింగం, అభినందనలు ఇక ఉండకపోవచ్చు. విండీస్‌ క్రికెటర్లు సరికొత్త రీతిలో సహచరులతో సంబరాలు చేసుకుంటున్నారు. వికెట్‌ పడగొట్టిన మార్కినో మిండ్లీతో జాన్‌ కాంప్‌బెల్‌ కాలును తాకిస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

క్రికెట్లో వచ్చిన ఈ కొత్త సంప్రదాయాన్ని చూడబోతుంటే... క్రికెట్ లో షేక్ హ్యాండ్ కి బదులుగా షేక్ లెగ్ నూతన సంప్రదాయం అయ్యేలా కనబడుతుంది.