ఇస్లామాబాద్: తన ఇంట్లోని టీవీ తాను పగులగొట్టినట్లు చెప్పిన పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీకి చెందిన పాత వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తన కూతురు ఇంట్లో ఓ ఇండియన్ టీవీ షోలో హారతి దృశ్యాన్ని చూస్తూ అలా చేయడానికి ప్రయత్నించిందని, దాన్ని చూసి తాను టీవీని గోడకేసి కొట్టి ధ్వంసం చేశానని ఆఫ్రిదీ చెప్పాడు. 

మీరెప్పుడైనా కోపంలో టీవీని పగులగొట్టారా అని యాంకర్ అడిగితే... "ఓసారి టీవీని పగులగొట్టాను. నా భార్య వల్ల దాన్ని పగొగులగొట్టాను. స్టార్ ప్లల్ డ్రామాలు చాలా పాపులర్ అయ్యాయి. వాటిని ఒంటరిగా చూడాలని నేను నా భార్యకు చెబుతూ వచ్చాను. నేను ఓసారి గది నుంచి వెలుపలికి వచ్చినప్పుడు నా కూతురు స్టార్ ప్లస్ షో చేస్తూ నా పిల్లలు హారతి దృశ్యాన్ని అనుకరిస్తుండడం చూశాను. నేను ఆమె వైపు చూసి టీవీని గోడకేసి కొట్టాను" అని జవాబిచ్చాడు. 

ఆ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయింది. షాహిద్ ఆఫ్రిదీ వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. హిందువు అయినందుకు జట్టులో డానిష్ కనేరియా వివక్షను ఎదుర్కున్నాడనే షోయబ్ అక్తర్ వ్యాఖ్యల దుమారం చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో షాహిద్ ఆఫ్రిదీ వీడియో వెలుగు చూసింది.