పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ, తన కూతురు అక్సా అఫ్రిదిని, పాక్ యువ క్రికెటర్ షాహీన్ అఫ్రిదీకి ఇచ్చి నిశ్చితార్థం జరిపించినట్టు సమాచారం. రికార్డుల ప్రకారం 44 ఏళ్ల షాహిద్ అఫ్రిదీకి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు.

పెద్ద కూతురు అక్సా అఫ్రిదీని పెళ్లి జరిపించాలని అఫ్రిదీని అభిప్రాయపడుతున్నాడట. అయితే ప్రస్తుతం షాహీన్ అఫ్రిదీ వయసు రికార్డుల ప్రకారం కేవలం 20 ఏళ్లు మాత్రమే. అదీకాక అతను ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు.

అంతేకాకుండా అక్సా ఇంకా చదువుకుంటోంది. దీంతో ఈ ఇద్దరి వివాహం రెండేళ్ల తర్వాత జరిపించాలని నిర్ణయించుకున్నాడట రెండు కుటుంబాలు.