IND vs ENG: బుమ్రా దెబ్బకు తోకముడిచిన ఇంగ్లాండ్.. రాణించిన కుల్దీప్ !
India vs England: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు విశాఖ తీరంలో ఇంగ్లాండ్ తోకముడిచింది. బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విజృంభణతో 55.5 ఓవర్లకు 253 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.
India vs England: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్.. యార్కర్లలో ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుని ఇంగ్లాండ్ ను 253 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల అధిక్యం లభించింది.
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు రెండో టెస్టులో ఇంగ్లాండ్ వికెట్లు ఎగిరి పడుతున్నాయి. అద్భుతమైన యార్కర్ తో ఒల్లీ పోప్ ఔట్ కాగా, రెండు వికెట్లు ఎగిరిపడటం ఈ ఇన్నింగ్స్ లో మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ అద్భుతమైన యార్కర్లను సంధించి బుమ్రా 6 వికెట్లు తీసుకున్నాడు.
ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో యశస్వి జైస్వాల్ సాధించిన టాప్-5 రికార్డులు
బుమ్రా తన బౌలింగ్ లో తొలి టెస్టులో అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ పోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బాల్ కు రెండు వికెట్లు ఎగిరిపడ్డాయి. అలాగే, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో మూడు వికెట్లు తీసుకున్నాడు. బెన్ డకెట్, ఫోక్స్, రెహాన్ అహ్మద్ లను పెవిలియన్ కు పంపాడు.
ఇంగ్లాండ్ ప్లేయర్లలో జాక్ క్రాలే 76 పరుగులు, బెన్ స్టోక్స్ 47 పరుగులతో టాప్ స్కోరర్లుగా ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో (209) అదరగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 396 (యశస్వి జైస్వాల్ 209; జేమ్స్ అండర్సన్ 3-47, రెహాన్ అహ్మద్ 3-65)
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 253 (జాక్ క్రాలే 76; బుమ్రా 6, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు)
ఫ్లాప్ షో.. అవకాశాల కొమ్మలను నరికేసుకుంటున్న శుభ్‌మన్ గిల్.. !