ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు లీగ్ పాయింట్ల పట్టిక ఎలా ఉంటుందో అంచనా వేస్తూ న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్. 2021 సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉంటుందని, రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంటుందని అంచనా వేశాడు స్కాట్ స్టైరిస్.

తన పాయింట్ట పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి స్థానంలో నిలవడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్... ‘వై మచ్చా... ఎక్స్ మచ్చా’ అంటూ కామెంట్ చేసింది...

 

ఇంతకుముందు సీఎస్‌కే తరుపున ఆడిన స్కాట్ స్టైరిస్, ఈ కామెంట్‌తో తన తప్పు తెలుసుకున్నానంటూ కామెంట్ చేశాడు.  ‘నేను చేసినదానికి నన్ను నేనే మందలించుకుంటున్నా... సూపర్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ ఇప్పటికే నన్ను మూసుకోమని చెప్పాడు’ అంటూ కామెంట్ చేశాడు స్కాట్ స్టైరిస్.