అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్... మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా చరిత్ర...
ఇంగ్లాండ్ మహిళా మాజీ క్రికెటర్ సారా టేలర్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. సాధారణంగా అయితే మహిళా క్రికెట్ జట్టుకి పురుష క్రికెటర్లు కోచ్‌లుగా ఉంటారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో అది షరా మామూలే.. అందులో ఎలాంటి విశేషమూ లేదు. ప్రస్తుతం భారత మహిళా జట్టుకి భారత మెన్స్ మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మెన్స్ టీమ్‌కి ఓ మహిళా క్రికెటర్ కోచ్‌గా ఉండడం మాత్రం క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా చూసింది లేదు...
అయితే ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ చరిత్రను తిరగరాస్తూ, పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్‌గా బాధ్యతలు అందుకోనుంది. అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనుంది సారా టేలర్. ఇంతకుముందు ఇంగ్లాండ్ మెన్స్ కౌంటీ టీమ్ సుసెక్స్ టీమ్‌కి స్పెషలిస్ట్ కోచ్‌గానూ బాధ్యతలు తీసుకుంది సారా టేలర్.
మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతూ చరిత్ర క్రియేట్ చేయనుంది... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల గురించి తెలిసిందే, కానీ సుసెక్స్ జట్టుకి వికెట్ కీపింగ్ కోచ్‌గా ఇదే ఏడాది మార్చిలో బాధ్యతలు నిర్వహించింది సారా టేలర్...
అంతేకాదు ప్రొఫెషనల్ మెన్స్ క్రికెట్ టీమ్‌లో ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గానూ సారా టేలర్‌కి రికార్డు ఉంది... ఆస్ట్రేలియాలో నార్తన్ డిస్ట్రిక్స్ మెన్స్ జట్టుకి వికెట్ కీపర్‌గా ఆడింది సారా... 32 ఏళ్ల సారా టేలర్ తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరుపున 10 టెస్టు మ్యాచులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచులు ఆడింది.
టెస్టుల్లో 300 పరుగులు చేసిన సారా, వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4056 పరుగులు, 90 టీ20 మ్యాచుల్లో 16 హాఫ్ సెంచరీలతో 2177 పరుగులు చేసింది. నగ్నంగా ఫోటోషూట్‌ల్లో పాల్గొని సంచలనం క్రియేట్ చేసిన సారా టేలర్, మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించింది.
అయితే టీ20 లీగ్‌ల్లో మాత్రం పాల్గొంటూ బిజీగా ఉంటోంది సారా టేలర్. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ‘వెల్ష్ ఫైర్’ జట్టుకి ఆడుతున్న సారా టేలర్, వుమెన్స్ టీ20కప్‌లో సుసెక్స్, నార్తన్ డైమండ్స్ జట్లకి ఆడుతోంది...
ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోటోషూట్ నిర్వహించింది సారా టేలర్. ఒంటి మీద నూలుపోగు లేకుండా బ్యాటు పట్టుకుని షాట్ ఆడుతున్నట్టు సారా టేలర్ ఇచ్చిన ఫోజులు క్రికెట్ ప్రపంచంలో సంచలన క్రియేట్ చేశాయి...
మహిళా క్రికెటర్లలో అత్యంత అందగత్తెల్లో ఒకరైనా సారా టేలర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని సారా టేలర్, 2019లో తన మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్‌గా ప్రకటించింది. మానసిక సమస్యలతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సారా టేలర్, ప్రొఫెషనల్ వికెట్ కీపింగ్‌లో అత్యధిక క్యాచులు అందుకున్నవారిలో ఒకరిగా ఉంది.
Read Also: స్వదేశానికి చేరుకున్న ఆవేశ్ ఖాన్... నెట్ బౌలర్ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి...
