క్రికెట్ కామంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పై విమర్శలు చేయడానికి, ఆయనను విపరీతంగా ట్రోల్ చేయడానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దానికి తోడు సంజయ్ మంజ్రేకర్ చేసే పనులు కూడా అలానే ఉంటాయి. తాజాగా ఆయన తన ఉద్యోగం గురించి ట్విట్టర్ లో  ఓ పోస్టు పెట్టగా.... దానిపై ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

AlsoRead క్షమాపణలు చెప్పాల్సిందే... మరోసారి అడ్డంగా బుక్కైన మంజ్రేకర్...

మంజ్రేకర్ క్రికెటర్ గా కెరీర్ ని ప్రారంభించి.. తర్వాత కామెంటేటర్ గా సెటల్ అయిన సంగతి తెలిసిందే. కాగా...  ఐ లవ్ మై జాబ్ అంటూ తాజాగా మంజ్రేకర్ కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్స్ టీమిండియా తలపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మైదానంలో కూర్చొని ఉన్న ఫోటోని మంజ్రేకర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి... ఐలవ్ మై జాబ్ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

 

కాగా.. మంజ్రేకర్ ట్వీట్ కి నెటిజన్లు హిలేరియస్ గా స్పందించారు. నా ఉద్యోగం నాకు నచ్చింది అంటూ మంజ్రేకర్ అంటే.. మాకు మాత్రం టీవీ ని రిమోట్ తో మ్యూట్ లో పెట్టడం ఇష్టం అంటూ కామెంట్స్ చేశారు. టీవీ ని మ్యూట్ లో పెడితే.. కామెంటరీ విన్సాలిన అవసరం లేదు కదా అదే అర్థంతో నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. ఇలాంటి కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొందరు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.