కామంటేటర్ సంజమ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్ల కోపానికి గురయ్యారు. సంజయ్ మంజ్రేకర్ తన తోటి కామెంటేటర్ హర్షా భోగ్లేకి క్షమాపణలు చెప్పాల్సిందేనని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే.... టీమిండియా ఇటీవల బంగ్లాదేశ్ తో పింక్ బాల్ టెస్టు సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ సిరీస్ ని టీమిండియా కైవసం చేసుకుంది.

అయితే... ఈ పింక్ బాల్ టెస్టుకి మంజ్రేకర్ కామెంటేటర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో తన తోటి కామెంటేటర్ హర్షా భోగ్లేని కించపరిచే విధంగా మంజ్రేకర్ మాట్లాడారు. పింక్ బాల్ టెస్టుకి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని హర్షా భోగ్లే  ముందుగా సూచించారు. ముఖ్యంగా బాల్ ఎలా కనపడుతోంది అనే విషయాన్ని క్రికెటర్లను అడిగి తెలుసుకోవాలని ఆయన భావించారు.

అయితే... అతని ఆలోచనపై మంజ్నేకర్ నీళ్లు చల్లారు. హర్షా భోగ్లేని కించపరిచే విధంగ ‘ఈ విషయం నువ్వే అడగాలి. ఏమో ఏదో సాధారణ క్రికెట్‌ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు’ అని మాట్లాడాడు. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడని సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.

Also Read అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు... విరాట్ కి సునీల్ గవాస్కర్ చురకల

 ‘ క్రికెట్‌లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంజ్రేకర్‌ను అడగండి. ఫీల్డ్‌లో అంపైర్‌ ఔటిచ్చిన సందర్భంలో కూడా మంజ్రేకర్‌ని అడిగిన తర్వాతే ఇవ్వాలి’ అని ఒక నెటిజన్‌ విమర్శించగా, ‘ నువ్వు అసలు కామెంటరీ బాక్స్‌లో ఉండాలని ఏ భారత అభిమాని కోరుకోవడం లేదు’ అని మరొకరు మండిపడ్డారు.  ‘ క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త కామెంటేటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది మంజ్రేకరే’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు.

‘ ఇరు జట్ల ఆటగాళ్లను పింక్‌ బాల్‌ ఎలా కనిపిస్తుందని అడిగితే బాగుంటుందని హర్హా భోగ్లే చెప్పిన దాంట్లో తప్పేముంది. అది ఒక మంచి వ్యాఖ్యానం.  కానీ భోగ్లేతో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నీకు నీ సహచర కామెంటేటర్‌తో ఎలా మాట్లాడాలో తెలీదు. అతని కనీసం ఒక మ్యాచ్‌ కూడా ఆడకపోయినా కామెంటేటర్‌గా సక్సెస్‌ అయ్యాడు’ అని మరొకరు పేర్కొన్నారు.