హైదరాబాద్: హైదాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన వక్ర బుద్ధిని చాటుకున్నాడు. భారత్ పట్ల తన అక్కసును వెళ్లగక్కాడు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపే విషయంలో తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. 

మెర్రీ క్రిస్మస్ దోస్తోం... వెరీ హ్యాపీ డిసెంబర్ 25 అంటూ ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలు మాలిక విజయం సాధించినట్లు సంకేతం ఇచ్చాడు. మరో వైపు నిరాశగా ఎదురు తిరిగి వెళ్లిపోతున్న ధోనీ ఫొటోను పెట్టాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు మాలిక్ పై దుమ్మెత్తి పోస్తున్ారు. 

పాకిస్తాన్, ఇండదియా మధ్య 2012 డిసెంబర్ 25వ తేదీన జరిగిన తొలి టీ20 మ్యాచులో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో మాలిక్ అర్థ సెంచరీ చేశాడు. విజయం తర్వాత భారత ఆటగాళ్లను అపహాస్యం చేస్తూ మాలిక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో మాలిక్ పై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు ఆ మ్యాచుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ తన బుద్ధిని చాటుకున్ాడు. మాలిక్ కు అదే తరహాలో నెటిజన్లు రిప్లై ఇస్తున్ారు. ప్రపంచ కప్ పోటీల్లో మాలిక్ డకౌట్ అయిన ఫోటోను, రోహిత్ కాళ్ల ముందు మాలిక్ పడిపోయిన ఫొటోను, మాలిక్ ను ధోనీ స్టంపౌట్ చేస్తున్న ఫొటోను రిట్వీట్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్ారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ ను ఇండియా చిత్తకొట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.