టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహీ సతీమణి సాక్షి సింగ్ వినూత్నంగా విషెస్ తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ ఫామ్ హౌజ్‌లో ధోనీతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Also Read:ధోనీ బర్త్ డే... హెలికాప్టర్ సాంగ్ తో బ్రావో స్పెషల్ విషెస్

‘‘ నీ పుట్టినరోజు గుర్తు చేసుకుంటూ... ఒక ఏడాది గడిచిపోయింది. కాసింత వయసు పెరిగింది, ఇంకొంచెం తెలివిగా, ఇంకొంచెం తీయగా మారాల్సిన అవసరం వుంది. నువ్వు తీయని శుభాకాంక్షలు, బహుమతులకు లొంగని వాడివి. కేకు కోసి, క్యాండిల్స్ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్‌డే ధోనీ’ అని సాక్షి కామెంట్ పెట్టింది.

అంతకుముందు ధోనికి.. విరాట్ కోహ్లీ బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే మహీ భాయ్.. మంచి ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని కోరుతున్నా.. అంటూ మిస్టర్ కూల్‌తో పలు సందర్భాల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.