టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే ఈ రోజు. దీంతో... ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా... వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. డ్యాన్సర్‌, సింగర్‌ అయిన బ్రావో తన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సహచరుడు ధోనీపై ఒక పాటను రూపొందించాడు.

ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆ పాటను విడుదల చేశాడు.  ఈ పాటను ధోనీకే అంకితమిస్తున్నట్టు డ్వేన్‌ చెప్పాడు. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ నెంబ ర్‌-7. ఆల్‌ ఆఫ్‌ రాంచీ షౌటింగ్‌ ధోనీ. ఆల్‌ ఆఫ్‌ ఇండియా షౌటింగ్‌ మాహి. ఆల్‌ ఆఫ్‌ చెన్నై షౌటింగ్‌ తలా’ అంటూ ఈ పాట సాగుతుంది. ఇక హెలికాప్టర్‌ షాట్‌కు కూడా డ్యాన్స్‌ మూమెంట్‌ను రూపొందించాడు. కాగా.. ఈ పాట ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ధోనీ ఫ్యాన్స్.. ఈ వీడియోని ఇప్పుడు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. 2016లో  కూడా బ్రావో ఓ వీడియోని విడుదల చేశారు.  అతని ‘డీజే బ్రావో.. చాంపియన్‌’ పాటకు యూట్యూబ్‌లో 9 కోట్లపైన వ్యూస్‌ రావడం విశేషం.