అప్పటినుంచి మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.  

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. జరగాల్సిన ఎన్నో మ్యాచ్ లు వాయిదా పడిపోయాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. ఈ లాక్ డౌన్ కారణంగా మరోసారి ధోనీ రిటైర్మెంట్ టాపిక్ పతాకస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. 

కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్‌ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది.