టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కి దూరంగా ఉంటున్నారు. వరల్డ్ కప్ అయిపోయి దాదాపు నాలుగు నెలలుకావస్తున్నా... ఆయన తిరిగి మైదానంలో అడుగుపెట్టింది లేదు. దీంతో ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే... వాటిపై ఇప్పటివరకు ధోనీ స్పందించలేదు. బంగ్లాదేశ్ మ్యాచ్ కి కూడా సెలక్టర్లు ధోనీని పక్కనపెట్టేశారు. మైదానంలో అడుగుపెట్టకపోయినా... తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.

తనతోపాటు.. తన ముద్దుల కుమార్తె జీవా ఫోటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వీరి ఫోటోలను, వీడియోలను ధోనీ భార్య సాక్షి ధోనీ ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. కాగా.... ఇటీవల ధోనీ, అతని కుమార్తె జీవా తో కలిసి దిగిన ఫోటోని హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. జీవాని మిస్ అవుతున్నానంటూ అందులో హార్దిక్ పేర్కొన్నాడు. కాగా...ఆ పోస్టుకి ధోనీ భార్య సాక్షి... చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

AlsoRead బంగ్లాతో టీ20 : పంత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో.. 'చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా. పెద్ద మనిషి ధోనీని కూడా' అంటూ హార్దిక్ పోస్టు చేయగా... దానికి సాక్షి... 'హార్దిక్‌.. నీకు తెలుసా? రాంచీలోనూ నీకు ఓ ఇల్లు ఉంది' అని కామెంట్‌ చేశారు. అయితే సాక్షికి హార్దిక్‌ కూడా రిప్లై ఇచ్చాడు. 'అవును. నాకు తెలుసు. ధన్యవాదాలు సాక్స్' అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు కూడా తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

 

ధోనీ, జీవాలతో కలిసి ఉన్న ఫోటోని పాండ్యా పోస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ ముగ్గురూ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోని కూడా హార్ధిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో జీవా కలర్‌పుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌ను ధరించింది. ఇదిలా ఉండగా.. హార్దిక్ ఇటీవల లండన్ లో శస్త్ర చికిత్స  చేయించుకున్నారు. చికిత్స అనంతరం చిన్నగా కోలుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Miss this little one (and the big guy too) ❤

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Nov 2, 2019 at 12:25am PDT