కరోనా వైరస్‌పై పోరు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశం ఒక్కటైంది. జాతి సమైక్యతను చాటుతూ సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9.09 నిమిషాల వరకు దేశ ప్రజలు ఇళ్లలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చి లైట్లు వెలిగించారు.గో కరోనా.. గో కరోనా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

Also Read పీఎం కేర్స్‌కు యూవీ విరాళం: సాయం చేశా.. దీపం వెలిగిస్తున్నానంటూ ట్వీట్...

వీరిలో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు కూడా పాల్గొన్నారు. తమ ఇంటి ఆవరణలో ప్రమిదలు వెలిగించారు. ఆ దీపాల కాంతిలో విరుష్క జోడి మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను వీరు తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 

‘ఐక్యతగా అందరి కోసం కలిసి ప్రార్థిస్తే కచ్చితంగా తేడా ఉంటుంది. ప్రతి ఒక్క జీవి కోసం ప్రార్థిద్ధాం. అందరం ఒక్కటిగా నిలపడదాం’ అంటూ కోహ్లీ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. 

ఇక అనుష్క శర్మ.. తన పోస్టు మొత్తాన్ని ఓ ఫోటోగా పేర్కొన్నారు. అందులో ‘‘ చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ ఒక దీపాన్ని వెలిగిస్తున్నాను. దీపాన్ని వెలిగించేటప్పుడు నాలో ఉన్న చీకటిని పోగొట్టుకోవాలని నేను కోరుతున్నాను. గత కొద్ది రోజులుగా దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చాలా మంది తమ కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడో ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కసారిగా చాలా మంది జీవితాలు తల కిందులయ్యాయి.  ఇంకొందరు.. ప్రజల ప్రాణాలు కాపాడటానికి విరామం లేకుండా కృషి చేస్తున్నారు. వారందరి కోసం నేను ఈ రోజు రాత్రి అదనంగా ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. కాగా.. వీరి పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.