సచిన్ స్టాచ్యూ చేయమంటే, స్టీవ్ స్మిత్ స్టాచ్యూ చేశారేంటి? మాస్టర్ విగ్రహంపై ట్రోల్స్...
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ... ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లా ఉండడంతో ట్రోల్స్..
ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. అహ్మద్‌నగర్‌కి చెందిన ప్రమోద్ కంబల్ అనే శిల్పి, సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని రూపొందించాడు. అయితే ఈ విగ్రహం సచిన్ టెండూల్కర్‌లా కాకుండా ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లా కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి..
సచిన్ టెండూల్కర్ స్పెషల్ ట్రేడ్ మార్క్ స్ట్రైయిట్ డ్రైవ్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు. అయితే ఈ విగ్రహంలో సచిన్ టెండూల్కర్ పోలికల కంటే స్టీవ్ స్మిత్ పోలికలే ఎక్కువగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ అని పేరు చూసి, గుర్తు పట్టడం తప్ప, ఇది మన మాస్టర్ విగ్రహం అంటే చూడగానే గుర్తు పట్టడం కూడా కష్టమే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విగ్రహంపై కామెంట్ చేసేటప్పుడు నవ్వేశాడు. అంటే విగ్రహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘భారతరత్న’ అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిసైడ్ అయిన ఎంసీఏ, ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజు దీన్ని ఆవిష్కరించాలని అనుకుంది.
అయితే పనులు ఆలస్యం కావడంతో నవంబర్ 1న ఆవిష్కరించారు. ఇంకాస్త ఆలస్యమైనా రూపు రేఖలు సరి చూసుకుని, మరోసారి చేయించి ఉంటే బాగుండేదని అంటున్నారు సచిన్ టెండూల్కర్ వీరాభిమానులు..