Asianet News TeluguAsianet News Telugu

సచిన్ టెండూల్కర్ షాకింగ్ లుక్... కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మాస్టర్ తొలిసారి...

‘ప్లాస్మా కరెక్ట్ సమయంలో అందిస్తే, పేషెంట్లు త్వరగా కోలుకుంటారు. నేను కూడా వైద్యులతో మాట్లాడి, ప్లాస్మా ఇవ్వబోతున్నా... మీరు కరోనా నుంచి కోలుకుని ఉంటే, వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి ప్లాస్మా డొనేట్ చేయండి, ప్రాణాలు కాపాడండి’ అంటూ సందేశం ఇచ్చిన సచిన్ టెండూల్కర్...

Sachin Tendulkar Shocking look after recovering from Covid-19 CRA
Author
India, First Published Apr 24, 2021, 7:22 PM IST

‘క్రికెట్ అనేది మతం అనేది, దానికి దేవుడు సచిన్ టెండూల్కర్’... ‘క్రికెట్ గాడ్’గా గుర్తింపు తెచ్చుకున్న ‘మాస్టర్ బ్లాస్టర్’  సచిన్ టెండూల్కర్, 48వ పుట్టినరోజు నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సచిన్ అభిమానులు, ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురిపించారు. దీంతో తనను విష్ చేసిన వారికి వీడియో సందేశం ద్వారా థ్యాంక్యూ చెప్పారు సచిన్ టెండూల్కర్.

‘నాకు విష్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గత నెల రోజులు, నాకు చాలా టఫ్‌గా అనిపించింది. నేను కోవిద్ బారిన పడడం, 21 రోజులు దానితో బాధపడి, మీ అందరి ప్రార్థనల కారణంగా కోలుకున్నాను. అయితే నేను ఇప్పుడు ఓ సందేశం ఇవ్వడానికి వచ్చాను. డాక్టర్లు ఇది చెప్పమని ప్రత్యేకంగా చెప్పారు.

గత ఏడాది నేను ఓ ప్లాస్మా డొనేషన్ క్యాంప్ ప్రారంభించాను. అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే ప్లాస్మా కరెక్ట్ సమయంలో అందిస్తే, పేషెంట్లు త్వరగా కోలుకుంటారు. నేను కూడా వైద్యులతో మాట్లాడి, ప్లాస్మా ఇవ్వబోతున్నా... మీరు కరోనా నుంచి కోలుకుని ఉంటే, వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి ప్లాస్మా డొనేట్ చేయండి, ప్రాణాలు కాపాడండి’ అంటూ సందేశం ఇచ్చారు సచిన్ టెండూల్కర్.

అయితే చాలారోజుల తర్వాత సచిన్ టెండూల్కర్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్, తెల్లగడ్డంతో ముఖం పాలిపోయి, నీరసంగా కనిపించారు. ఆయనలో మునుపటి వెలుగు మాత్రం కనిపించలేదు. దీంతో సచిన్ మళ్లీ మునుపటిలా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. 

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన సచిన్ టెండూల్కర్, టైటిల్ సాధించారు. అయితే ఆ తర్వాత కరోనా బారిన పడ్డారు. సచిన్ టెండూల్కర్‌తో పాటు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న బద్రీనాథ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది.

కరోనా బారిన పడిన తర్వాత ఆరు రోజులకు పరిస్థితి సీరియస్ కావడంతో ముంబైలో ఆసుపత్రిలో చేరారు సచిన్ టెండూల్కర్. ఆసుపత్రిలో చేరిన నాలుగు రోజులకు కోలుకుని డిశార్చి అయ్యారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకున్నారు సచిన్ టెండూల్కర్.

Follow Us:
Download App:
  • android
  • ios