Asianet News TeluguAsianet News Telugu

Sachin Tendulkar: అభిమానికి షాకిచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. ఏం చేశారంటే?

Sachin Tendulkar: భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనకు మంచి ఆదరణ ఉంది. క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ అతనే. అతనికి క్రికెట్ దేవుడు అనే బిరుదు కూడా ఇవ్వబడింది. ఆయన తాజాగా ఓ తన అభిమానికి సర్ ఫ్రైజ్  చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

Sachin Tendulkar shares heartfelt moment with fan wearing  KRJ
Author
First Published Feb 2, 2024, 3:51 AM IST | Last Updated Feb 2, 2024, 3:51 AM IST

Sachin Tendulkar: క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. సచిన్‌ని క్రికెట్‌ దేవుడు అని కూడా పిలుస్తారు. ప్రపంచ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ సచిన్. ఆయన బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టితే.. ఇక ఊచకోతనే.  అసలు ఏ బౌలర్ ను కూడా కనికరించేవాడు కాదు. ప్రతి బంతిని చీల్చిచెందాడేవాడు. ఇలా ఆయన తన కెరీర్ లో  ఎన్నో రికార్డులు సృష్టించి భారత అభిమానుల హృదయాలను శాసించాడు. ఆయన 2013లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా.. ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉన్నాడు. తాజాగా తన ఎక్స్ హ్యాండిల్ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా? 
 
కారులో ప్రయాణిస్తున్న సచిన్.. ముంబై ఇండియన్స్ MI జెర్సీ ధరించిన అభిమానిని చూశారు. ఆ టీ షర్ట్‌పై 'ఐ మిస్ యూ టెండూల్కర్' అని రాసి ఉంది, అది చూసి ఆశ్చర్యపోయిన సచిన్, ఫ్యాన్ దగ్గర కారు ఆపమని డ్రైవర్‌ని కోరాడు. సడెన్ గా  కారు అద్దాన్ని కిందికి దించి.. తన ఫ్యాన్‌ని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిని అడిగాడు, అలాంటి సర్ ప్రైజ్ చూసి ఓ అభిమాని ఆశ్చర్యపోయాడు. మాస్టర్ బ్లాస్టర్ ఆ అభిమానిని తన చుట్టూ తిరిగి టీ షర్ట్ చూపించమని అడిగాడు. దీని తర్వాత..రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించి తన అభిమానిని మెచ్చుకొని అతనికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అలాంటి సర్ ప్రైజ్ చూసి  అభిమాని ఆశ్చర్యపోయాడు.

సచిన్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసి.. 'సచిన్ టెండూల్కర్‌ను కలుసుకున్నాడు. నాపై కురిసిన ప్రేమను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. అభిమానుల నుంచి వచ్చే ప్రేమ నా జీవితాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది.’ తన అభిమాన ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను సడెన్ గా చూడటంతో ఆ అభిమాని సర్ ప్రైజ్ అయ్యారు.నమ్మలేకపోతున్నానని ఆ అభిమాని చెప్పాడు. అభిమాని తన పేరు హరీష్ కుమార్ అని చెప్పి.. గతంలో దిగిన తనతో(సచిన్) తో దిగిన ఫోటోను చూపించి సచిన్ ను కూడా సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ  వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.   

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios