. ఈ రోజు మాత్రం ఎడమ చేతితో ఆడినట్లు చెప్పాడు. అందుకు.. తనకు యువరాజ్ సింగ్ సహాయం చేశాడని.. ఎడమ చేతితో ఎలా ఆడాలో యువరాజ్ నేర్పించాడని  సచిన్ పేర్కొన్నాడు.

ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. కి ప్రపంచ దేశాల్లోనూ విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఆయన ఆటకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే.. ఆయనను క్రికెట్ గాడ్ అని కూడా పిలుస్తారు. అయితే.. సచిన్.. కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. గోల్ఫ్ కూడా అదరగొట్టగలనని తాజాగా నిరూపించాడు. అది కూడా ఎడమ చేతితో ఆడటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆయనకు అలా ఎడమ చేతితో ఆడేలా కోచింగ్ ఇచ్చింది.. యువరాజ్ సింగ్ కావడం విశేషం. తాను గోల్ఫ్ ఆడుతున్న వీడియోని సచిన్ షేర్ చేశారు. తాను రెగ్యులర్ గా కుడి చేతితోనే ఆడతానని.. అయితే.. ఈ రోజు మాత్రం ఎడమ చేతితో ఆడినట్లు చెప్పాడు. అందుకు.. తనకు యువరాజ్ సింగ్ సహాయం చేశాడని.. ఎడమ చేతితో ఎలా ఆడాలో యువరాజ్ నేర్పించాడని సచిన్ పేర్కొన్నాడు.

కాగా.. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా మంది హార్ట్ ఎమోజీలు కామెంట్ రూపంలో పోస్టు చేయడం విశేషం.

View post on Instagram

కాగా.. దేశంలో కరోనా విజృంభించడం మొదలుపెట్టినప్పటి నుంచి సచిన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక వీడియోని షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా.. షేర్ చేసిన ఈ వీడియో కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం.