భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  ప్రముఖ పాప్ సింగర్ మార్క్ నోప్లెర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ఇవాళ ఉదయం మార్క్‌ను కలిశానని..  అతనిని కలవడం ఆనందంగా ఉందని... నోప్లెర్ గొప్ప సంగీతకారుడని.. అంతకుమించి గొప్ప వ్యక్తిత్వమున్నవాడని సచిన్ ట్వీట్ చేశారు.

మరోవైపు క్రికెట్‌కు చేసిన సేవలకు గాను ఐసీసీ హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో సచిన్ టెండూల్కర్‌ జూలై 18న స్థానం పొందిన సంగతి తెలిసిందే. టెండూల్కర్ కన్నా ముందు    రాహుల్ ద్రావిడ్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే‌లు భారత్ తరపున ఐసీసీ హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో సచిన్ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.